కొవ్వూరు (ప్రజా అమరావతి );
యర్నగూడెం పిపిసి కేంద్రాన్ని జేసి గ డా.బి ఆర్ .అంబేద్కర్ , కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు తో కలిసి తనిఖీ చేశారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కు సంబంధించిన కంప్యూటర్ లో నమోదు వివరాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు.
జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
జిల్లాలో శాశ్వత రైతు భరోసా కేంద్రాలు నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. ధాన్యం కొనుగోళ్లు జిల్లా వ్యాప్తంగా రైతులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యం తేమ శాతం 17 లేదా 16 ఉండాలని అన్నారు. తేమ శాతం తగ్గించేందుకు అవసరమైన అరవేసే యంత్ర పరికరాలు కూడా అందుబాటులో కి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి రైతు నష్టపోకూడదనే ఉద్దేశం తో ఉన్నామని అన్నారు.
addComments
Post a Comment