ఒక దేశం, ప్రాంతం యొక్క చరిత్రను తెలుసుకోవడానికి పుస్తక పఠనం ఎంతో ఉపకరిస్తుందని విశ్రాంత ఆచార్యులు కంటమణి చౌదరి రావు తెలిపారు. కొవ్వూరు  (ప్రజా అమరావతి);ఒక దేశం, ప్రాంతం యొక్క చరిత్రను తెలుసుకోవడానికి పుస్తక పఠనం ఎంతో ఉపకరిస్తుందని విశ్రాంత ఆచార్యులు 

కంటమణి చౌదరి రావు తెలిపారు.గురువారం స్థానిక జిల్లా గ్రంధాలయ సంస్థ, కొవ్వూరు ప్రధమ శ్రేణి శాఖా గ్రంధాలయంలో 54వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో వకృత్వ పోటీలు నిర్వహించారు. 


ఈ సందర్భంగా  కంటమణి చూదరి రావు, విశ్రాంత ఆచార్యులు ముఖ్య అతిధిగా హాజరయ్యి భారత స్వతంత్ర ఉద్యమ చరిత్ర గురించి ప్రసంగించారు.  స్వతంత్ర  సాధించటానికి ఎందరో  మహనీయులు కృషి చేసియున్నారని దేశభక్తి అంటే దేశంకోసం ఎదైనా చేయడం అని , వ్యక్తి గత స్వార్ధం లేకుండా ఉండడమే నని తెలియజేసారు.  నేటి యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కి బానిసలుగా మారుతూ, పాఠ్య పుస్తకాలు చదవడం తప్ప, ఇతర సమాచారాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని అన్నారు. విధిగా గ్రంధాలయాలను వెళ్లి అర్ధ గంట సేపు అక్కడ గడిపితే సామాజిక అంశాలపై కొద్దీ పాటి అవగాహన కలిగి పోటీ పరీక్షల్లో విజయం సాధించగలరని శ్రీనివాస మూర్ తెలిపారు.


ఈ రోజు జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో బాగంగా వకృత్వ పోటీల్లో జూనియర్ లకు "నాకు నచ్చిన జాతీయ నాయకుడు" , సీనియర్ విభాగంలో " ఆధునిక భారత నిర్మాణం లో యువత పాత్ర ' అంశంపై పోటీలు నిర్వహించారు.  ఈ పోటీలలో సుమారు 110 మంది విద్యార్ధులు పాల్గొన్నారు


ఈ కార్యక్రమంలో సంస్కృత పాఠశాల  ప్రధానోపాధ్యయులు  గోవర్ధనం శ్రీనివాస మూర్తి, లైబ్రరీయన్ జీవివిఎన్.త్రినాధ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.