ఏ ఒక్కరి ప్రాణనష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు ఆదేశం
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);


*నెల్లూరు జిల్లా కుండపోత వర్షాలపై కలెక్టర్ చక్రధర్ బాబుతో ఢిల్లీ నుంచి ఫోన్లో మాట్లాడిన మంత్రి మేకపాటి*


వరదనీటితో పోటెత్తుతున్న సంగం ఆనకట్ట, సోమశిల ప్రాజెక్టుల పరిస్థితిపై ఆరా


ఏ ఒక్కరి ప్రాణనష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు ఆదేశంనెల్లూరు పట్టణంలోని పరిస్థితి సహా వెంకటగిరి, గూడూరు, ఉదయగిరి, ఆత్మకూరు , కావలి తదితర ప్రాంతాలలో పంటనష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి మేకపాటి


ఆత్మకూరు, కావలి, చేజర్ల మండలాల్లోని ప్రజల ఇబ్బందులను అధికారులు అప్రమత్తమై పరిష్కరించాలని కలెక్టర్ కు దిశానిర్దేశం


ఎన్డిఆర్ఎఫ్ సహా భద్రతా బలగాలను పంపి రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రాణాలు లెక్కచేయకుండా సెల్ఫీల కోసం వెళ్లే యువతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశం


జిల్లా తీర ప్రాంతాలతోపాటు ఆత్మకూరు నియోజకవర్గంలోని బొగ్గేరు, వీర్ల గుడిపాడు, నల్లవాగు, పందలవాగు ప్రభావిత లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని చెప్పిన మంత్రి మేకపాటి


ఎగువన అన్నమయ్య ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి సోమశిలకు వరద నీరు ఉద్ధృతంగా వస్తుండడంపై ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా సమీక్ష నిర్వహించాలన్న మంత్రి మేకపాటి


వర్షం ప్రభావం తగ్గిన వెంటనే రైతులకు ఇబ్బంది కలగకుండా పంట నష్టాలపై అంచనా వేసేలా అధికారులు ఉపక్రమించే విధంగా జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని కలెక్టర్ కి మంత్రి మేకపాటి దిశానిర్దేశం