నెల్లూరు, నవంబర్ 10' (ప్రజా అమరావతి); --- భారత ఉపరాష్ట్రపతి జిల్లా పర్యటనకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ నెల 12వ తేదీన జిల్లాకు వచ్చి 14వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న దృష్ట్యా వారు పర్యటించే ప్రదేశాల్లో అన్నిచోట్ల గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.ఎలాంటి లోటు పాట్లు లేకుండా ప్రోటోకాల్ ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. బుధవారం ఉదయం ముందస్తు భద్రత సమన్వయం (అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లై జాన్- ఏ.ఎస్.ఎల్)లో భాగంగాజిల్లా కలెక్టర్ జిల్లా పోలీస్ అధికారి శ్రీ సి.హెచ్ విజయ రావు తో కలిసి ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రదేశాలను పరిశీలించారు. తొలుత ఉపరాష్ట్రపతి ఈ నెల 12వ తేదీ ఉదయం ప్రత్యేక రైల్లో వెంకటాచలం చేరుకుంటున్న దృష్ట్యా రైల్వే స్టేషనులో వారు కాసేపు ప్లాట్ ఫాం పై కలియతిరిగి రైల్వే అధికారులతో స్వాగత ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా రేణిగుంట నుండి వెంకటాచలం వరకు రైలు మార్గంలో ఉన్న వంతెనలు, రైల్వే ద్వారాలు లెవెల్ క్రాసింగ్ లు అన్నీ కూడా పటిష్టంగా ఉన్నాయా లేదా పరిశీలించాలన్నారు. లెవెల్ క్రాసింగ్ వద్ద భద్రతా సిబ్బందిని వుంచి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వెంకటాచలం రైల్వే స్టేషన్ లో రాష్ట్రపతికి స్వాగతం పలికే ప్రముఖులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రానున్న రెండు రోజులు వర్షం కురవనున్న దృష్ట్యా తడవకుండా షామియానా ఏర్పాటు చేయాలన్నారు. ఎవరికి కేటాయించిన విధులను వారు సజావుగా నిర్వహించాలన్నారు. అనంతరం వారు స్వర్ణ భారత్ ట్రస్ట్ చేరుకొని అక్కడ ట్రస్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ శ్రీ విజయ మోహన్ సూరితో ఉప రాష్ట్రపతి పర్యటన గురించి కాసేపు చర్చించారు. తదుపరి అక్కడ నూతనంగా నిర్మించిన కౌసల్య సదనంను ఉపరాష్ట్రపతి ఈనెల 13వ తేదీ ప్రారంభించనున్న దృష్ట్యా దాన్ని వారు పరిశీలించారు. తదనంతరం అక్షర విద్యాలయం లో అతిథి గృహం, పర్ణశాల, హెలిప్యాడ్, సోమ శిక్షణ కేంద్రం తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ఈనెల 14వ తేదీన విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతున్నందునl కోవిడ్ పరీక్షలు ముందుగా చేయించాలన్నారు. ఈనెల 12వ తేదీ సాయంత్రం జరిగే లాయర్ వారపత్రిక 40వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న దృష్ట్యా గొలగమూడి రోడ్డు లోని వి పి ఆర్ ఫంక్షన్ హాలును వారు సందర్శించి అక్కడ వేదిక ఏర్పాట్లు, విచ్చేస్తున్న ప్రముఖుల వివరాలను కలెక్టర్ లాయర్ వార పత్రిక సంపాదకులు శ్రీ శివ ప్రభాత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్, ఎస్పీ వెంట సంయుక్త కలెక్టర్ రెవిన్యూ శ్రీ హరెందిర ప్రసాద్, అదనపు ఎస్పీ శ్రీమతి వెంకటరత్నం, ట్రైనీ కలెక్టర్ శ్రీ ఫర్హాన్ అహ్మద్ ఖాన్, నెల్లూరు, కావలి, గూడూరు ఆర్ డి వో లు చైత్ర వర్షిని, శ్రీ శీనా నాయక్, శ్రీ మురళీకృష్ణ , జడ్పీ సీఈవో శ్రీ శ్రీనివాసరావు, డి.ఎస్.ఒ శ్రీ వెంకటేశ్వర్లు, డి టి సి శ్రీ చందర్, మత్స్యశాఖ,వ్యవసాయ శాఖ జె డి లు శ్రీ నాగేశ్వరావు, శ్రీమతి ఆనంద్ కుమారి, ఏ డి ఆర్ యం శ్రీ శ్రీకాంత్, డి ఎఫ్ఓ శ్రీ కాంత్ రెడ్డి, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి ఎస్ ఈ లు శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ భారతరత్న, జిల్లా బి.సి.సంక్షేమ అధికారి శ్రీ వెంకటయ్య, ఎన్ ఐ సి డి ఐ ఓ శ్రీ సురేష్, డి.ఎస్.పి శ్రీ హరినాథ్ రెడ్డి, శ్రీ కోటారెడ్డి, శ్రీ గాంధీ, సీఐ శ్రీ జగన్ మోహన్ రావు, వెంకటాచలం తహశీల్దార్ శిరీష, రైల్వే స్టేషన్ మాస్టర్ చిట్టి బాబు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భారత ఉపరాష్ట్రపతి జిల్లా పర్యటనకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు
addComments
Post a Comment