మంత్రి హరీశ్‌రావుపై ఎమ్మెల్యే ఈటల ఫైర్

 తెలంగాణ (ప్రజా అమరావతి);


 సిద్ధిపేట: మంత్రి హరీశ్‌రావుపై ఎమ్మెల్యే ఈటల ఫైర్


అయ్యారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్ధిపేట ప్రజలు హరీశ్‌రావును గెలిపిస్తే.. ఆయన అధర్మం, అన్యాయం, దౌర్జన్యం పక్షాన నిలబడ్డారని తప్పుబట్టారు. హరీశ్‌రావు ఏ కుట్రలను, డబ్బులను మద్యాన్ని, దాబాయింపులను నమ్ముకున్నాడో వాటికే ఆయన బలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేశారని, ఆ దళిత బంధును తెలంగాణ అంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేటలో కూడా దళిత గర్జన పెట్టే రోజు వస్తుందని, దానికి తానే నాయకత్వం వహిస్తానని ఈటల రాజేందర్ ప్రకటించారు.