సాంఘీక సంక్షేమ శాఖ రూపొందించిన ఎస్‌వోపి (స్టాండర్ట్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌), ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ మోడల్‌ కంటింజెన్సీ ప్లాన్‌ బుక్‌లెట్‌ విడుదల చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


అమరావతి (ప్రజా అమరావతి);


శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పినిపే విశ్వరూప్, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, ఎంపీ నందిగం సురేష్, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు*


సాంఘీక సంక్షేమ శాఖ రూపొందించిన ఎస్‌వోపి (స్టాండర్ట్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌), ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ మోడల్‌ కంటింజెన్సీ ప్లాన్‌ బుక్‌లెట్‌ విడుదల చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటిస్‌ యాక్ట్‌ అమలుకు సంబంధించి సమగ్ర సమాచారంతో రూపొందించిన బుక్‌లెట్‌ మరింతగా ఉపయోగపడుతుందన్న సీఎం. అంతేకాక ఈ చట్టం క్రింద నమోదైన కేసులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా జరగాలని అధికారులకు సూచించిన సీఎం.


అట్రాసిటీ చట్టం అమలు, పర్యవేక్షణపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలన్న సీఎం. పెండింగ్‌ కేసులను కూడా వెంటనే క్లియర్‌ చేయాలని ఆదేశాలు, ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి వెంటనే న్యాయం అందేలా చూడాలని అధికారులకు ఆదేశం.


ఎస్సీ, ఎస్టీలకు నిర్ణీత కాలవ్యవధిలోగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవడం, వారికి సంబంధించి పరిపాలనా సమస్యలను తొలగించడం, దురాగతాలను నిర్మూలించడం వంటి అంశాలపై రూపొందించిన ఎస్‌వోపి బుక్‌లెట్‌ విడుదల చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం, రక్షణ, వారి అభివృద్దికి సంబంధించిన సమగ్ర సమాచారంతో రూపొందించిన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌. భాదితులకు తగిన న్యాయం జరగకపోతే నేరుగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వం. 


ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కే.సునిత, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image