శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి



, విజయవాడ (ప్రజా అమరావతి):  దేవస్థానం మల్లికార్జున మహా మండపం రెండవ అంతస్తు నందు భక్తుల మధ్య  కోవిడ్ నివారణా చర్యలు పాటిస్తూ భక్తులు కూర్చుని అన్నప్రసాదం స్వీకరించు విధముగా అన్నదాన విభాగం నందు ఏర్పాట్లు చేసి,   అన్నదాన కార్యక్రమం  ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు , శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ  పునః ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా మహామండపము 2 వ ఫ్లోర్ నందు అన్నదానం జరుగు హాలు నందు ఆలయ వైదిక కమిటీ సభ్యుల వారి ఆధ్వర్యంలో  పాలకమండలి చైర్మన్ ,  కార్యనిర్వహణాధికారి   శ్రీ అమ్మవారికి పూజలు నిర్వహించి, కొబ్బరి కాయలు కొట్టి, అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించి శ్రీ అమ్మవారి భక్తులకు అన్నప్రసాదమును స్వయముగా వడ్డించారు. అనంతరం కార్యనిర్వహణాధికారి వారు అన్నప్రసాదం స్వీకరించిన భక్తులను అన్నదానం ఏర్పాట్లు మరియు ఇతర అంశముల ఏర్పాట్లు పై  అభిప్రాయం అడిగి తెలుసుకొనగా భక్తులు సంతృప్తి ని వ్యక్తం చేయడం జరిగినది.

   ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు శ్రీమతి ఎన్. సుజాత , ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, శ్రీవిద్య ఉపాసకులు శ్రీ పి.వి.గౌరీశంకర్ గురూజీ , ఆలయ అర్చక సిబ్బంది మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Comments