ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోండి*ఈ నెల 16న ఎంపిటీసి, జడ్పీటీసి ఎన్నికలకు పోలింగు, 18న కౌంటింగ్‌ :-*


*ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోండి :-*


*ఓటర్లకు విజ్ఞప్తి చేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి కోటేశ్వర రావు :-*


కర్నూలు, నవంబర్ 15 (ప్రజా అమరావతి):-


*జిల్లాలో మిగిలిపోయిన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి. కోటేశ్వర రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.*


*జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ... జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఆదోని మండలం బైచిగేరి, ఆదోని మండలం ధనాపురం, ఆదోని మండలం హనవాలు, చాగలమర్రి మండలం చాగలమర్రి 3, క్రిష్ణగిరి మండలం టి గోకులపాడు, వెల్దుర్తి మండలం మల్లేపల్లి, దొర్నిపాడు మండలం chakarajuvemula ఎంపిటిసి స్థానాలకు, నంద్యాల జెడ్పీటీసీ స్థానానికి ఈ నెల 16న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని, ఈ నెల 18న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపడతామన్నారు. మొత్తం 68 పోలింగ్ కేంద్రాలలో పురుషులు 31,433 మంది, స్త్రీలు 32,298, ఇతరులు 7, మొత్తం 63,748 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  అదే విధంగా మ్యాన్పవర్ పవర్ సంబంధించి మొత్తం 448 మంది ఎన్నికలలో విధులు నిర్వహిస్తారన్నారు. అదేవిధంగా 30 పోలింగ్ కేంద్రాల్లో సెన్సిటివ్, 22 పోలింగ్ కేంద్రాలను హైపర్ సెన్సిటివ్ గా గుర్తించామన్నారు. అదే విధంగా నంద్యాల జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏడు మంది వీడియో గ్రాఫర్ లు, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 17 మంది వీడియో గ్రాఫర్ లు, పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లు 29 మంది ఎన్నికల విధులు నిర్వహిస్తారన్నారు. అదే విధంగా ఎస్ యస్ టి టీమ్ 06, ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఎన్నికలలో విధులు నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు అన్ని పకడ్బందీగా పూర్తి చేశామన్నారు. ఓటర్లు మాస్కు ధరించి కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, నిజాయితీగా పారదర్శకంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరిస్తూ ఎటువంటి తప్పిదాలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగు కేంద్రాలను గుర్తించి తగినంత బందోబస్తును ఏర్పాటు చేయడమే కాక వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేసామన్నారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు, భయాందోళనలకు గురి కాకుండా తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.*