రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులుగా బాధ్యతల్ని స్వీకరించిన డాక్టర్ జి. హైమావతి
విజయవాడ (ప్రజా అమరావతి):
రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులుగా డాక్టర్ జి. హైమావతి
సోమవారం ఉదయం గొల్లపూడి లోని తన కార్యాలయంలో బాధ్యతల్ని స్వీకరించారు.
ఇప్పటివరకు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులుగా పనిచేసిన డాక్టర్ గీతాప్రసాదిని అక్టోబర్ 31న పదవీ విరమణ చేయడంతో
సంచాలకులుగా డాక్టర్ జి.హైమావతిని నియమిస్తూ
వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.
నేషనల్ లెప్రసి ఇరాడికేషన్ అదనపు సంచాలకులుగా, కంటివెలుగు స్టేట్ నోడల్ అధికారిగా బాధ్యతల్ని నిర్వహిస్తున్న డాక్టర్ జి. హైమావతిని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులుగా (పూర్తి అదనపు బాధ్యతలు) నియమితులయ్యారు. బాధ్యతల్ని స్వీకరించిన డాక్టర్ జి. హైమావతిని అధికారులు, కార్యాలయ సిబ్బంది ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
మాజీ సంచాలకులు డాక్టర్ గీతా ప్రసాదిని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment