అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు
సబ్ కలెక్టరు Dr.నిథిమీనాI.A.S
తెనాలి (ప్రజా అమరావతి);
తెనాలి డివిజన్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని తెనాలి సబ్ కలెక్టరు నిథిమీ నా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల ఆధికారి, జిల్లా ఎన్నికల అధికారి,సూచనల మేరకు SVEEP( సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రో ల్ పార్టిసిపేషన్ ) నిర్వహణలో భాగంగా 01-11-2021 నుండి మొదలైన ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ-2022 కార్యక్రమo పురస్కరించుకొని సబ్ కలెక్టరు నిథిమీనా మాట్లాడుతూ, 18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్క పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని, ఓటు విలువ, ఓటు యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు సవివరంగా BLOలను వివరించాలని కోరారు.
ఆమె శనివారం పెదరావూరు , కటెవరం, పట్టణం లోని రావి సాంయ్య మునిసిసిపల్ బాయ్స్ పాఠశాలను సండర్శించి,ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆశిస్తున్నారో వారు సమీపంలోని బూత్ స్థాయి అధికారిని లేదా తహశీల్ధార్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
2022జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు వయసు నిండుతున్న వారంతా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అలాగే చిరునామా, పేర్లలో మార్పులు చేర్పులకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని ఫారం-6 కొత్త ఓటరు నమోదుకు, ఫారం-7 జాబితాలో మార్పులకు, ఫారం-8 పోలింగ్ బూత్ మార్పుల కోసం దరఖాస్తు చేసు కోవాలన్నారు.
ఈ పర్యటనలో MRO ,RI, VROలు సబ్ కలెక్టరును అనసరిరించారు.
addComments
Post a Comment