ఓటీఎస్ కింద స్వచ్ఛందంగా చెల్లించెందుకు ముందుకు వొచ్చిన వారి పేరుతో 1,03, 620 మందికి రిజిస్ట్రేషన్ పత్రాలను అందచేత



ఏలూరు   (ప్రజా అమరావతి);


పశ్చిమగోదావరి జిల్లాలో నియోజకవర్గాల వారీగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం (Jagannath Absolute House Rights Scheme)  కింద లబ్ది పొందేందుకు అర్హులైన వారిచే ఓటీఎస్ కింద స్వచ్ఛందంగా చెల్లించెందుకు ముందుకు వొచ్చిన వారి పేరుతో 1,03, 620 మందికి రిజిస్ట్రేషన్ పత్రాలను అందచేసి సంపూర్ణ హక్కు ను కల్పించడం జరుగుతోంది.


గతంలో  ప్రభుత్వం నుంచి తీసుకున్న స్థలాలను లబ్దిదారుని, లేదా వారసులకు సంపూర్ణ హక్కు కల్పించి ఉండలేదు. అదే విధంగా ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన అప్పు పూర్తిగా చెల్లించినా వారికి ఆ అస్తిపై కూడా సంపూర్ణ హక్కు కల్పించిన సంఘటన లు లేవు. అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వొచ్చిన రోజు నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఆ దిశలోనే గతంలో ఏ ప్రభుత్వం పేద వారికిగానీ, లబ్దిదారులకి గానీ, వారి వారసులకు ప్రభుత్వం కేటాయించిన గృహలు, ఇళ్లపై సంపూర్ణ హక్కు కల్పించిన దాఖలాలు లేవని చెప్పవొచ్చు. 


పశ్చిమ లో నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల జాబితా, చెల్లించిన వివరాలు , 


ఆచంట నియోజకవర్గంలో  8083 మంది లబ్ధిదారులు ఓటీఎస్ కింద  చెల్లించాల్సిన రూ. 2 24 కోట్లకు గాను ;  6205 మంది రూ. 76 లక్షలు  చెల్లించారు



ఏలూరు నియోజకవర్గ పరిధిలో 2970 మంది లబ్ధిదారులు ఓటీఎస్ కింద  చెల్లించాల్సిన రూ.3.29  కోట్లకు గాను ; 1576  మంది రూ.  96 లక్షలు  చెల్లించారు


దెందులూరు  10621 మంది లబ్ధిదారులు ఓటీఎస్ కింద  చెల్లించాల్సిన రూ. 2.38 కోట్లకు గాను ;  8263 మంది రూ.  72 లక్షలు  చెల్లించారు



గోపాలపురం  14169 మంది లబ్ధిదారులు ఓటీఎస్ కింద  చెల్లించాల్సిన రూ.4.03 కోట్లకు గాను ;  10364 మంది రూ.91 లక్షలు   చెల్లించారు.


ఉంగుటూరు 12862 మంది లబ్ధిదారులు ఓటీఎస్ కింద  చెల్లించాల్సిన రూ.3.91  కోట్లకు గాను ;  9743 మంది రూ.1.12   కోట్లు  చెల్లించారు


తాడేపల్లిగూడెం పరిధిలో 9465 మంది లబ్ధిదారులు ఓటీఎస్ కింద  చెల్లించాల్సిన రూ.4.58  కోట్లకు గాను ;  6375 మంది రూ. 1.55 కోట్లు  చెల్లించారు



కొవ్వూరు10528  మంది లబ్ధిదారులు ఓటీఎస్ కింద  చెల్లించాల్సిన రూ. 3.90 కోట్లకు గాను ;  7488 మంది రూ. 1.32 కోట్లు  చెల్లించారు


నరసాపురం  6719 మంది లబ్ధిదారులు ఓటీఎస్ కింద  చెల్లించాల్సిన రూ. 2.16 కోట్లకు గాను ;  5213 మంది రూ.  86 లక్షలు చెల్లించారు



పాలకొల్లు 7757 మంది లబ్ధిదారులు ఓటీఎస్ కింద  చెల్లించాల్సిన రూ.2.77  కోట్లకు గాను ; 5634 మంది రూ. 96 లక్షలు చెల్లించారు



భీమవరం  5591 మంది లబ్ధిదారులు ఓటీఎస్ కింద  చెల్లించాల్సిన రూ. 3 కోట్లకు గాను ;  3899 మంది రూ. 1.04  కోట్లు  చెల్లించారు.


 ఉండి  10316 మంది లబ్ధిదారులు ఓటీఎస్ కింద  చెల్లించాల్సిన రూ.3.70 కోట్లకు గాను ;  7356 మంది రూ. 1.33 కోట్లు  చెల్లించారు.


తణుకు 8166 మంది లబ్దిదారులు చెల్లించాల్సిన రూ.3.28 కోట్లకు గాను ; 5247 మంది రూ 96 లక్షలు చెల్లించారు.


పోలవరం 13074 మంది లబ్ధిదారులు ఓటీఎస్ కింద  చెల్లించాల్సిన రూ. 2.90 కోట్లకు గాను ;  8595 మంది రూ. 46 లక్షలు   చెల్లించారు


నిడదవోలు 9687 మంది లబ్ధిదారులు ఓటీఎస్ కింద  చెల్లించాల్సిన రూ.3.73  కోట్లకు గాను ;  8263 మంది రూ. 1.08 కోట్లు  చెల్లించారు


చింతలపూడి 12610 మంది లబ్ధిదారులు ఓటీఎస్ కింద  చెల్లించాల్సిన రూ. 1.73 కోట్లకు గాను ;  11184 మంది రూ. 75 లక్షలు    చెల్లించారు



Comments