పశ్చిమగోదావరి జిల్లాలో 1,03,620 మంది లబ్దిదారులకి జె.ఎస్.బి.హెచ్.ఎస్. ద్వారా భూమి హక్కు పత్రాలు.



ఏలూరు (ప్రజా అమరావతి) ;   


పశ్చిమగోదావరి జిల్లాలో 1,03,620 మంది లబ్దిదారులకి జె.ఎస్.బి.హెచ్.ఎస్. ద్వారా భూమి హక్కు పత్రాలు.


సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చే మంగళవారం తణుకులో భారీ సభ


సీఎం పుట్టిన రోజు పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి కార్యక్రమం 


హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాల బాకి మాఫీ కింద ఓటీఎస్ ద్వారా,   ప్రభుత్వం కేటాయించిన స్థలంలో గృహ నిర్మాణం చేసుకున్న వారలకు  "జగనన్న సంపూర్ణ భూమి హక్కు పధకం " (జె.ఎస్.బి.హెచ్.ఎస్.)  ప్రయోజనం చేకూర్చే దిశలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా.. తణుకు పట్టణంలో రాష్ట్ర స్థాయి పధకాన్నీ మంగళవారం (డిసెంబర్ 21) "నాడు ప్రారంభించనున్నారు.

 ఈ పధకం ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధి దారుల్లో జిల్లా కు సంబంధించిన 25 వేలమంది లబ్దిదారులకి మంగళవారం రిజిస్ట్రేషన్ పత్రాలు అందచేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. 



ఓటీఎస్‌ పథకం ద్వారా సంపూర్ణ భూమి హక్కు కల్పించే దిశగా  22–ఎ తొలగింపు ,  స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, యూజర్‌ ఫీజులను రద్దు చెయ్యడం జరుగుతుంది. సరళి కృతమైన విధానంలో భాగంగా  గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌.   రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్, ఫీల్డ్‌స్కెచ్, లోన్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌లు జారీచేస్తారు.  ఓటీఎస్‌ అన్నది పూర్తి స్వచ్ఛందం కార్యక్రమం, బహుళ ప్రయోజనం కలిగి లబ్దిదారులకి క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సంపూర్ణ హక్కు కల్పించడం ముఖ్య ఉద్దేశ్యం. రాష్ట్ర వ్యాప్తంగా  రూ.10వేల కోట్ల రూపాయల భారాన్ని పేదలపై తొలగిస్తున్నారు.  


జగనన్న సంపూర్ణ భూమి హక్కు పధకం పశ్చిమగోదావరి జిల్లా ముఖచిత్రం :


జిల్లాలో ని ఏలూరు, కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డి గూడెం డివిజన్ పరిధిలోని 1137 గ్రామ / వార్డు సచివాలయలలో 1,42,,618 మంది లబ్దిదారులకి ఈ పధకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటి వరకు 1126 సచివాలయ లకు చెందిన 1,03,620  మంది లబ్ధిదారులలో రుణాలు తీసుకున్న 13,948 మంది, రుణాలు లేని 89,672 మంది లబ్దిదారులకి  ఓటీఎస్ ద్వారా సంపూర్ణ భూమి హక్కు పత్రాలు పొందడం జరుగుతోంది. ఓటీఎస్ కింద 13,948 మంది లబ్దిదారులు రూ,14,68,28,277 కింద ఉన్న రుణాలు చెల్లించడం ద్వారా వారికి రుణాలను పూర్తిగా మాఫీ చేయడం జరుగుతోంది. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా స్థలం పొంది స్వంతంగా ఇల్లు కట్టుకున్నవారు, రుణాలు తీసుకుని ఇప్పుడు ఎటువంటి బకాయిలు లేని 89,672 మంది లబ్ధిదారులు ఒకొక్కరు పది రూపాయలు చొప్పున రూ.8,96,720 చెల్లింపు చేసి ఈపధకం ద్వారా సంపూర్ణ భూమి  హక్కు ప్రయోజనం చేకూరనుంది. పై పేర్కొన్న లబ్దిదారులకి దశల వారీగా గ్రామ వార్డు సచివాలయలు ద్వారా ఇల్లు/స్థలం రిజిస్ట్రేషన్ చేసి, సంబంధించిన తహసిల్దార్ ద్వారా జగనన్న సంపూర్ణ భూమి హక్కు పత్రాలు అందచేసేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతొంది. 


జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో లాంఛనంగా ప్రారంభించే సమయంలో సీఎం జన్మదినాన్ని అందరి మనసుల్లో సుస్థిరంగా నిలిపే దిశలో  అన్ని నియోజకవర్గాల్లో సంబంధించిన తహసిల్దార్ లు ద్వారా జిల్లా యంత్రాంగం మంగళవారం 25 వేల మంది లబ్దిదారులకి రిజిస్ట్రేషన్ పత్రాలు అందించే కార్యక్రమం సమాంతరంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు.



Comments