కొవ్వూరు (ప్రజా అమరావతి);
డిసెంబర్ 14వ తేదీ నుండి 20 వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు
విద్యుత్ పొదుపు పై విద్యార్థులకు అవగాహన తరగతులు ..డీఈ అచ్యుతాచారి
విద్యుత్ విషయంలో పొదుపు అనేది ప్రధానమనీ , దానిని విస్మరిస్తే భావితరాలకు విద్యుత్ కొరత ఏర్పడుతుందని కొవ్వూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి అచ్యుతాచారి అన్నారు.
డిసెంబర్ 14వ తేదీ నుండి 20 వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కొవ్వూరు పట్టణం లోని శ్రీ అభ్యాస స్కూల్ నందు విద్యార్థినీ విద్యార్థులకు విద్యుత్ పొదుపు పై వ్యాసరచన పోటీలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అచ్యుత చారి మాట్లాడుతూ ఇంధన పొదుపు అందరి బాధ్యత అని విద్యుత్ ను వృధాగా వినియోగం చేయడంతో భావితరాలకు విద్యుత్ కొరత ఏర్పడుతుందన్నారు. ఒక యూనిట్ విద్యుత్ను పొదుపు చేస్తే రెండు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లే నని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలోకొవ్వూరు పట్టణ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ , శ్రీ అభ్యాస స్కూల్ కరస్పాండెంట్ రఘురాం, ఉపాధ్యాయినీ ,ఉపాధ్యాయులు విద్యార్థినీ , విద్యార్థులు ఉన్నారు.
addComments
Post a Comment