1983-84 నుంచి ఈనాటి వరకు వివిధ ప్రభుత్వాలు పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం కోసం మార్జిన్ మనీలు, సబ్సిడీలు, రుణాలు అందించారన్నరు



కొవ్వూరు (ప్రజా అమరావతి) ;  


కొవ్వూరు డివిజన్ పరిధిలోని 21679 మంది  లబ్దిదారులు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం కింద రూ.3,56,81,437 లు ఓటీఎస్ కింద చెల్లింపు చేసినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో ఓటీఎస్ కోసం అర్హులైన 36,411 మంది లబ్ధిదారులను గుర్తించా మన్నారు. ఈ పథకంలో భాగంగా ఓటీఎస్ ద్వారా చెల్లింపు చేసిన లబ్దిదారుల అప్పు పూర్తిగా మాఫీ చేయడం ప్రభుత్వ ఉద్దేశ్యం అన్నారు. అధికారులు గుర్తించి,  ఆమోదించిన లబ్దిదారుడు కి సరైన డాక్యుమెంట్లు లేనియెడల ఓటీఎస్ ద్వారా ప్రయోజనం పొందవచ్చునని తెలిపారు.


సోమవారం ఉదయం పత్రికా విలేఖరుల సమావేశం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ, 1983-84 నుంచి ఈనాటి వరకు వివిధ ప్రభుత్వాలు పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణం కోసం మార్జిన్ మనీలు, సబ్సిడీలు, రుణాలు అందించారన్నరు.  వీటిలో ఇందిరా ఆవాస్ యోజన పథకాలుపూర్తి సబ్సిడీ తో కూడినవి, సబ్సిడీ ఆధారితమైన  30 , 50, 60, 70  శాతంతో ఇచ్చినవి కూడా వున్నాయన్నారు.  గృహ రుణాలు తీసుకుని కొంత   చెల్లింపు చేసిన వారు, కొందరు అసలు చెల్లించని వారు ఉన్నారన్నారు. వాస్తవంగా ఇవి అన్నీ కూడా హౌసింగ్ సంస్థ వద్ద తాకట్టు (మార్టిగెజ్ )లో ఉన్నాయి. తాతలు, తండ్రుల నుంచి వారసత్వం గా వొచ్చిన ఆ ఇళ్ళు మరమ్మత్తు లకు గురవ్వడం, పూర్తిగా నివాస యోగ్యం గా లేకుండా ఉండడం వలన వాటిపై పునర్ నిర్మాణం చెయ్యవలసి వొచ్చినా ఎటువంటి అవకాశం ఉండదు. లబ్దిదారుడు వారసులు ఆర్ధికంగా అభివృద్ధి అయి ఆ ఇంటి పై  బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలన్నా , కొత్త ఇల్లు నిర్మాణం చేయాలన్నా మార్టిగేజ్  లో ఉన్నందున, ఎటువంటి డాక్యూమెంట్స్ లేనందున  సాధ్య పడదని మల్లిబాబు వెల్లడించారు.



అప్పుడు ఇచ్చిన డి ఫారం పట్టా కానీ, పొజిషన్ ధ్రువపత్రం కానీ ఇప్పుడు ఉన్న వ్యక్తి యొక్క తాతా, తండ్రి పేరుపై ఉంటుంది. ఇప్పుడు అవ్యక్తి ఆర్ధికంగా నిలదొక్కుకుని, ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చెయ్యలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నవరత్న లు ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేయ్యడం జరిగిందన్నారు.  


ఇంకా గతంలో ఇంటి పట్టాలను కలిగి ఉన్నవారి వారసులు  రిజిస్ట్రేషన్ డాక్యూమెంట్ వారి పేరుతో లేకపోవడంతో ఇప్పుడు ఇంటి నిర్మాణం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారని ఆర్డీవో మల్లిబాబు వివరించారు.  అటువంటి వారికి ప్రభుత్వం అండగా ఉండి, రిజిస్ట్రేషన్ పత్రాలు వారిపేరుతో ఇచ్చే సదుద్దేశంతో "ఓటీఎస్" పథకాన్ని తీసుకుని రావడం జరిగిందన్నారు. వన్ టైం సేట్టిల్మెంట్ పధకం ద్వారా బకాయి ఉన్న రుణాలను గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.15 వేలు చెల్లిస్తే వారి పేరుతో ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి, 8 పేజీలతో కూడిన పత్రాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఓటీఎస్ లో పేర్కొన్న వాటి కంటే తక్కువ బకాయిలు ఉంటే అంత మొత్తము చెల్లించడం ద్వారా సంపూర్ణ హక్కు పొందే అవకాశం ఓటీఎస్ ద్వారా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఓటీఎస్ ద్వారా చెల్లించి నట్లైనా, ఎటువంటి బకాయిలు లేని వారు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ, తదితర రుసుములు ఏమీ లేకుండా కేవలం రూ.10 లు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. స్థానిక తహశీల్దార్ లకు వీటి కోసం సబ్ రిజిస్ట్రార్  అధికారణ ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ పత్రాలు జారీ చేస్తామని వివరించారు. స్థానిక సచివాలయం ద్వారా డాక్యుమెంట్ పత్రాలు మీ ఇంటి వద్దనే అందించేస్తారని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు సెంట్ నుంచి రెండు సెంట్ల వరకు రిజిస్ట్రేషన్ చార్జీ లు రూ.4,వేలు , 5 వేలు వరకు అవ్వడంతో పాటు ఎంతో వ్యయ ప్రయాసలకు గురికావాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు మల్లిబాబు విజ్ఞప్తి చేసారు. 


మండలాలు వారీగా చెల్లింపు చేసిన లబ్ధిదారులు చెల్లించిన ఓటీఎస్ మొత్తం.. అత్తిలి 2010 (రూ.21.25 లక్షలు) ; చాగల్లు 1853 (రూ.16.93 లక్షలు) ; దేవరపల్లి 2083 (రూ.20.32 లక్షలు) ; గోపాలపురం  1582 (రూ.17.38 లక్షలు) ; ఇరగవరం 1151 (రూ.13.95 లక్షలు) ; కొవ్వూరు 2182 (రూ.38.82 లక్షలు) ; నిడదవోలు 1088 (రూ.24.69 లక్షలు) ; పెనుగొండ 1775 (రూ.18.68 లక్షలు) ; పెనుమంట్ర 1407 (రూ.17.02 లక్షలు) ; పెరవలి 1485 (రూ.20.90 లక్షలు) ; తాళ్లపూడి 1722 (రూ.26.86 లక్షలు) ; తణుకు 349 (రూ.10.39 లక్షలు) ; ఉండ్రాజవరం మండలం లో 2371 మంది (రూ.20.45 లక్షలు) చెల్లింపు చేశారన్నారు. పురపాలక సంఘం పరిధిలో కొవ్వూరు లో 185 మంది రూ.26.90 లక్షలుబ్; నిడదవోలు లో 183 మంది రూ.25.65 లక్షలు ; తణుకు లో 253 మంది 36.62 లక్షలు చెల్లించినట్లు తెలిపారు.  డిసెంబర్ 21 న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అర్హులైన చెల్లింపు జరిపిన లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందచేస్తారని ఆయన తెలిపారు.




Comments