తణుకు (ప్రజా అమరావతి) ;
డిసెంబర్ 21 న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన.. తణుకు లో బహిరంగ సభ
రాష్ట్ర స్థాయి జగనన్న సంపూర్ణ హక్కు పధకానికి శ్రీకారం
లబ్దిదారులకు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 21 న జగనన్న సంపూర్ణ హక్కు పధకం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ పత్రాలు ను అందచేయ్యడం జరుగు తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, చెరుకువాడ శ్రీరం గనాధరాజు
మంత్రి తెలిపారు.
మంగళవారం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి హెలిప్యాడ్, బహిరంగ సభ ప్రాంగణంలో ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఇరిగేషన్, ఇతర సమన్వయ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి పర్యటన రూట్ మ్యాప్ పై స్థానిక మునిసిపల్ కార్యాలయంలో చర్చించి, తగిన సూచనలు చేశారు .
ముందుగా క్షేత్రస్థాయిలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో, పోలీసు అధికారులతో పర్యటన చేసి భద్రత చర్య లపై కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సమన్వయ అధికారులకు సూచనలు చేశారు.
అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి ఎటువంటి అవాంతరాలకు తావులేకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కోవిడ్ మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో శానిటైజెషన్ చెయ్యాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సలహాదారు తలశిల రఘురాం, శాసన సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ మేనజింగ్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, ఆర్డీవో ఎస్. మల్లిబాబు, ఇతర సమన్వయ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment