21 న తణుకు నుంచి ప్రారంభించడం




తణుకు (ప్రజా అమరావతి);  


,రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 21 న తణుకు నుంచి ప్రారంభించడం, 52 లక్షల మంది  అర్హులైన పేదలకు నాలుగు లక్షల కోట్ల ఆస్తి ని వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం  జరుగుతోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధరాజు పేర్కొన్నారు.


సోమవారం తణుకు లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లలో భాగంగా   శాసన సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు తదితరులతో కలిసి హెలిప్యాడ్, సభావేదిక లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో 52 లక్షల మంది కుటుంబాలకు మేలు చేసే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఇటువంటి ఘట్టం ఎప్పుడు జరిగి ఉండలేదన్నారు.  మొత్తం లబ్దిదారులచే చెల్లించాల్సి ఉన్న 

హడ్కో ఋణాలు రూ.14 వేల కోట్ల లో ప్రభుత్వం రూ.10 వేల కోట్ల ను లబ్దిదారుల తరపున చెల్లించేందు కు ముఖ్యమంత్రి ముందుకు రావడం జరిగిందన్నారు. తణుకు లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకాన్ని ప్రారంభించడానికి, లబ్దిదారులకి రిజిస్ట్రేషన్ పత్రాలు అందించడానికి ముఖ్యమంత్రి వొస్తున్నారన్నారు. ఆరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం కావడం విశేష మన్నారు. ఆరోజు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కి శుభాకాంక్షలు తెలియజేసేలా, స్థానిక శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలోఘనంగా  ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 


 

ఈ పర్యటన లో మంత్రి వెంట  స్థానిక శాసనసభ్యులు కారుమూరి వెంకట  నాగేశ్వరరావు , రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ జి. తమ్మయ్య, అధికారులు , స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు


Comments