46వ జీఎస్టీ మండలి సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి


 

ఏపిఐసి - న్యూఢిల్లీ – డిసెంబర్ 31 (ప్రజా అమరావతి) :

46వ జీఎస్టీ మండలి సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి

చేనేత పై జి.ఎస్.టి పెంపు ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని జి.ఎస్.టి మండలిని కోరామని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.  ఈ రోజు ఉదయం న్యూఢిల్లీలోని విగ్యాన్ భవన్ లో జరిగిన 46వ జీఎస్టీ మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.  రేపటి నుంచి అమలులోకి రావలసిన చేనేత పై జి .ఎస్.టి పెంపును వాయిదా వేయాలని జి.ఎస్.టి మండలి నిర్ణయించిందని వెల్లడించారు.  చేనేత కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా, ఆదుకోవాలని మండలికి విజ్ఞప్తి చేశామని  పేర్కొన్నారు.   చేనేత పై జీఎస్టీ పెంపు ప్రతిపాదనను అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని తెలిపారు.  నిన్న జరిగిన ప్రీ-బడ్జెట్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు, దుగ్గరాజపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ లకు నిధులు కేటాయించాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమలో పరిశ్రమల స్థాపనకు రాయితీలు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరడం జరిగిందన్నారు.