డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోసు 99.04 శాతం మంది, రెండు డోసులు తీసుకున్న వారు 80.43 శాతం మంది ఉన్నారని

 


తణుకు (ప్రజా అమరావతి);  



కొవ్వూరు డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు  కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోసు 99.04 శాతం మంది, రెండు డోసులు తీసుకున్న వారు 80.43 శాతం మంది ఉన్నారని 


ఆర్డీవో ఎస్. మల్లిబాబు శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు.


కోవిడ్ మన మధ్యనే ఉందన్న విషయం గుర్తించుకొని  నడుచు కోవాల్సిన అవశ్యకత ను మల్లిబాబు గుర్తుచేశారు. డివిజన్ లో 100 శాతం 1వ డోసు పూర్తి చేసుకున్న మండలాలు కొవ్వూరు, తణుకు, కొవ్వూరు మునిసిపాలిటీ లు ఉన్నాయని తెలిపారు.


దేశంలో ఒమీక్రాన్ నమోదు అవుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవస్యకత ఉందన్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ అవ్వని వారు , 2వ డోసు వేసుకోవలసిన  ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా  వారికి దగ్గరలోని కేంద్రానికి వెళ్లి కోవిడ్ వ్యాక్సినేషన్స్  తీసుకోవాలని  విజ్ఞప్తి చేసారు. 


ఓమీక్రాన్ కేసులు దేశంలో నమోదు అవుతున్నాయని, ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు  కోవిడ్ మార్గదర్శకాలు, వ్యాక్సినేషన్ పై  ప్రజల్లో గ్రామ వార్డు స్థాయిలలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. . ఇప్పటికే తొలి డోసు తీసుకున్న వారు నిర్ణిత సమయం అయిన తదుపరి వారి దగ్గర లోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిపై  ఓమీక్రాన్ ప్రభావం తీవ్ర స్థాయిలో లేదని గణాంకాలు వెళ్లడిస్తున్నాయని పేర్కొన్నారు.


డివిజన్ పరిధిలోని 13 మండలాలు, 3 మునిసిపాలిటీ ల పరిధిలో 7,30,920 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా తొలి డోసు 7,23,888 మందికి (99.04%), రెండోవ డోసు 5,87,833 మందికి (80.43%) ఇప్పటి వరకు ఉచితంగా వెయ్యడం జరిగినట్లు తెలిపారు. డివిజన్ పరిధిలోని 296 గ్రామ వార్డు సచివాలయ లలో వంద శాతం వ్యాక్సిన్ అయినవి 155, 95 -100% లోపు 103, 90-95 శాతం లోపు 31 సచివాలయాలు ఉన్నాయని మల్లిబాబు తెలిపారు . 


కోవిడ్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, దేవాలయాలు, ప్రార్ధన మందిరాలు, మసీదు లు, చర్చి,  తదితర వేడుకలలో 500 లోపు ప్రజలను మాత్రమే  అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి ప్రదేశాల్లో వొచ్చే వారు విధిగా మాస్క్ ధరించాలని అన్నారు. షాపు యజమానులు, నిర్వాహకులు అక్కడికి వొచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించిన వారినే అనుమతించాలన్నారు. నియమాలను అతిక్రమిస్తే సంబంధించిన నిర్వాహకులపై కేసులు నమోదు చేసి, అపరాధ రుసుము,  షాపు లను తాత్కాలికంగా మూసి వెయ్యడం జరుగుతుందన్నారు 


కోవిడ్ కేసులు రాష్ట్రంలో , ఓమిక్రాన్ కేసులు దేశంలో నమోదు అవుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకొని  సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. 



Comments