ఎయిడ్స్ రహిత సమాజం మన అందరి లక్ష్యం
 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి రాజవిహార్ వరకు ర్యాలీ :-


ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య, డిఎంహెచ్ ఓ డాక్టర్ రామ గిడ్డయ్య :-


ఎయిడ్స్ రహిత సమాజం మన అందరి లక్ష్యం :-


కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య :-


కర్నూలు, డిసెంబర్ 01 (ప్రజా అమరావతి)


:-


ఎయిడ్స్ రహిత సమాజం మన అందరి లక్ష్యమని కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య అన్నారు.


ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగము కర్నూలు ఆధ్వర్యంలో కలెక్టర్ కాంప్లెక్స్ నుంచి రాజ్ విహార్ వరకు ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టరేట్ వద్ద కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య, డి ఎం హెచ్ ఓ డాక్టర్ రామ గిడ్డయ్యలు జెండా ఊపి ప్రారంభించారు.


కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య మాట్లాడుతూ....ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచుకుని తద్వారా వచ్చే ఇబ్బందుల నుంచి దూరంగా ఉండాలని చెప్పారు. అందరి భాగస్వామ్యంతోనే ఎయిడ్స్‌ వ్యాధి నివారణ సాధ్యమన్నారు. హెచ్ఐవి సోకిందంటే ఆత్మహత్యలకు పాల్పడే రోజుల నుండి... ప్రజలే స్వయంగా అవగాహన పెంచుకునే స్థాయికి చేరుకున్నామన్నారు. బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోగ్య పరంగా తీసుకున్న చర్యలతో పాటు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతున్నారు. ఎయిడ్స్ 0.04 పర్సంటేజ్ నమోదవుతుందని, అందరి సహకారంతో జిల్లాలో జీరో పర్సెంట్ నమోదయ్యేలా కృషి చేస్తామన్నారు.


ఎయిడ్స్ అండ్ లెప్రసి ఇన్చార్జ్ అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ దేవ సాగర్, జిల్లా యువజన సంక్షేమ అధికారి నాగరాజు నాయుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల నుంచి ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు, ఎన్ సిసి అధికారులు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, వైద్యశాఖ, లెప్రసీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.