కొవ్వూరు(కుమారదేవరం) (ప్రజా అమరావతి);
ఆలయాల అభివృద్ధి తో పాటుగా భక్తులకు మరింత గా సౌకర్యాలు కల్పించాలనే దేవాలయాలలో కమిటీ లను ఏర్పాటు చెయ్యడం జరిగిందని, కమిటీ సభ్యులు సమన్వయం చేసుకుంటూ సమిష్టితత్వం తో కలసి పని చేయాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
మంగళవారం స్థానిక దేవాలయం ఆవరణలో శ్రీ గండిపోచమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఛైర్మన్ గా గంధం శ్రీనివాస్, సభ్యులు గా గడ్డే బాలకృష్ణ, అడబాల దేవి, పోలేటి కృష్ణ, గోరిజాల వరలక్ష్మి, ఈతకోటి సూర్యకుమారి, మారిశెట్టి వెంకటలక్ష్మి ల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొని, ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కుమారదేవరం గ్రామ పరిధిలోని మూడు దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డ్ కమిటీ ఏర్పాటు చెయ్యాలని గ్రామస్థులు ముందుకు రావడంతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు
. శ్రీ గండిపోచమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఛైర్మన్ గా గంధం శ్రీనివాస్ ను, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఛైర్మన్ గా శ్రీమతి మద్దిపాటి ఉమాశ్రీదేవి, శివాలయానికి మారిశెట్టి వెంకటేశ్వరరావు ని నియమించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఆయా ఆలయ కమిటీ ఛైర్మన్, సభ్యులు హిందు ధర్మ పరిరక్షణకు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్గదర్శకాలు మేరకు కట్టుబడి ఉంటామని ప్రమాణ స్వీకారం చేశారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడంతోపాటు ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు.
తొలుత ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో మంత్రికి ఆలయ అధికారులు, నూతన కమిటీ సభ్యులు, అర్చకులు స్వాగతం పలికి, అమ్మవారి సన్నిధిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనం, ప్రసాదం అందచేశారు.
కొవ్వూరు మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి, ఎంపీటీసీ ఎండపల్లి నటరాజారావు, సర్పంచ్ కాసాని దుర్గ, నీటి సంఘం ప్రెసిడెంట్ బి. శ్రీనివాసరావు,
గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఏ. దుర్గారావు, ఎంపిడిఓ పి. జగదాంబ, ఆలయ కార్య నిర్వాహణాధికారి ఎమ్. నాగరాజు, డివిజన్ ఇన్సెపెక్టర్ ఎ. సుజన్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.
addComments
Post a Comment