రైతులకు మెరుగైన సేవాలు అందించాలనే సంకల్పంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు

 


కొవ్వూరు (ధర్మవరం) (ప్రజా అమరావతి);


రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన తర్వాత రైతులకు అందుతున్న సేవలపై పునః సమీక్ష చేసుకోవాలని ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు.


బుధవారం ధర్మవరం అర్భికే లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా మల్లిబాబు మాట్లాడుతూ, రైతులకు మెరుగైన సేవాలు అందించాలనే సంకల్పంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు


చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని రైతులకు చేరవేయడంలో క్షేత్రస్థాయిలో ని అధికారులు నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుందన్నారు. గతంలో మండల స్థాయిలో ఒక వ్యవసాయ అధికారి ఉంటే, నేడు గ్రామ స్థాయి వరకు వారిసేవలు అందుబాటులో కి వొచ్చాయన్నారు. ఈసందర్భంగా పలువురు రైతు ల నుంచి వివరాలు అడుగగా, గతంలో ఎక్కువగా ఎరువుల వినియోగం పై దృష్టి సారించి, అధిక దిగుబడులు ఆశించే వారమని, కొన్ని ప్రకృతి విపత్తు సమయంలో వాటిని తట్టుకోలేక దిగుబడి తగ్గేదన్నారు. సంప్రదాయ పద్దతులపై అర్భికెల్లో వ్యవసాయ సహాయకులు సూచనలు వలన మెరుగైన పంట వేసుకొని, విపత్తుల సమయంలో కూడా నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అర్భికెల్లో సేవలను రైతులు సద్వినియోగం చేసుకుని, ఆర్ధిక స్వావలంబన సాదించగలుగు తున్నట్లు తెలిపారు.


అర్భికెల్లో అందుతున్న సేవలు, ధాన్యం కొనుగోలు కి సంబంధించిన వివరాలు ఏ డి చంద్రశేఖర్ వివరించారు. ధర్మవరం పిపిసి పరిధిలో 475 మంది రైతులు 1369 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని, వీరిలో 269 మంది 1072 ఎకరాల్లో ధాన్యం వెయ్యడం ద్వారా 2250 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నారని తెలిపారు.


మండల స్థాయి అధికారులు, పౌర సరఫరాల అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Comments