*జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉంటాం*
*: రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు శంకర నారాయణ*
అనంతపురం, డిసెంబర్ 18 (ప్రజా అమరావతి):
*రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉందని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు శంకర నారాయణ పేర్కొన్నారు. శనివారం అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించగా, సమావేశంలో మంత్రివర్యులు శంకర నారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జడ్పిటిసి సభ్యులు, ఎంపిపిలు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులకు సమావేశ వివరాలను వెల్లడించారు.*
*ఈ సందర్భంగా మంత్రి శంకర నారాయణ మాట్లాడుతూ ఈరోజు జడ్పీ చైర్మన్ అధ్యక్షతన ఆరు గంటలపాటు జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగిందని, ఇందులో ప్రజల చేత ఎన్నికైన ప్రతి సభ్యుడు కూడా వారివారి పరిధిలో ఉన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించడంలో ఎలాంటి అలసత్వం లేకుండా ప్రభుత్వానికి నివేదికలు అందించాలని, పంటలకు నష్టపరిహారం తీసుకొచ్చేందుకు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా పంట నష్టపరిహారం వివరాలు తెలియజేసి కేంద్రం నుంచి నష్టపరిహారం తీసుకొచ్చేందుకు సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకం పనులపై సమావేశంలో చర్చించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వంలో మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి జరిగిన అవకతవకలపై ఎమ్మెల్యేలు, సభ్యులు ప్రస్తావించడం జరిగిందని, సభ్యులు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు ఒక నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. సమావేశంలో సభ్యులు అంతా జిల్లా అభివృద్ధికి ఉపయోగపడేలా సమస్యలు తెలియజేయడం జరిగిందని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న 63 జడ్పిటిసి స్థానాల్లో 62 జెడ్పిటిసి స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగిందని, జిల్లా అభివృద్ధికి, సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు.*
*ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ముందుగా 7 స్థాయి సంఘాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఇందులో సామాజిక న్యాయం జరిగేలా అన్ని స్థాయి సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా చరిత్రలో జిల్లా పరిషత్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎప్పుడు లేని విధంగా మహిళా మరియు శిశు సంక్షేమ స్థాయి సంఘానికి మైనార్టీ మహిళను చైర్మన్ గా చేయడం జరిగిందన్నారు. సమావేశంలో వ్యవసాయం, విద్య, వైద్య శాఖలకు సంబంధించి సభ్యులందరూ సమస్యలు తెలియజేశారని, వచ్చే సమావేశం నాటికి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తామన్నారు.*
*ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించి జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై నమ్మకంతో ప్రజలంతా ప్రతిపక్ష పార్టీకి ఉనికి లేకుండా మొత్తం అధికార పార్టీ సభ్యులను గత ఎన్నికల్లో గెలిపించడం జరిగిందన్నారు. అందుకు తగిన విధంగా మరింత బాధ్యతగా ప్రజల కోసం పని చేస్తామన్నారు.*
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మాట్లాడుతూ ఈరోజు జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగిందని, ఇందులో స్థాయి సంఘాల సభ్యులను ఎన్నుకోవడం తో పాటు, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన ముఖ్య అంశాలపై చర్చ జరిగిందన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ కు సంబంధించి వర్షాల వల్ల జరిగిన నష్టం, ముందస్తు రబీకి సంబంధించి ప్రొక్యూర్మెంట్ పై చర్చించామని, జిల్లాలో ముఖ్యమైన తాగునీటి సమస్య పరిష్కారానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, జల్ జీవన్ మిషన్ కు సంబంధించి చర్చ జరిగిందన్నారు. పెద్ద ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వైద్యం, విద్య, ఐసిడిఎస్ శాఖల పరిధిలో వైద్య మరియు కుటుంబ సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, పంచాయతీ రాజ్, డ్వామా కార్యక్రమాలపై పలు అంశాలను సభ్యులంతా సమావేశం దృష్టికి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో పలు సమస్యలపై అధికారులు, సభ్యులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాడు నేడు కు సంబంధించి పూర్తి స్థాయిలో పనులు చేపట్టడం లేదని తెలియజేయడం జరిగిందని, ఉపాధి పనులు, ఆర్డబ్ల్యూఎస్ పనుల్లో కొన్ని అవకతవకలు ఉన్నాయని సభ్యులు సమావేశం దృష్టికి తెచ్చారని, ఈరోజు సమావేశం దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యపై తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
addComments
Post a Comment