సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పై జిల్లా కలెక్టర్ చర్యలు

 సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పై జిల్లా కలెక్టర్ చర్యలు*


*: కదిరి తహసీల్దార్ మారుతిని కలెక్టరేట్ కు అటాచ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ*


అనంతపురం, డిసెంబర్ 04 (ప్రజా అమరావతి):


*కదిరి తహసీల్దార్ మారుతిని కలెక్టరేట్ కు అటాచ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. పాస్ పుస్తకం మంజూరు కోసం కదిరి తహసీల్దార్ లంచం అడిగారన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా, ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. సత్వరమే మారుతి కదిరి తహసీల్దార్ గా రిలీవ్ అయి.. తాత్కాలికంగా  కలెక్టరేట్లో రిపోర్ట్ చేసుకోవాలని నిర్దేశించారు. లంచం అడిగారన్న విషయమై సమగ్ర విచారణ చేయిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ విషయమై జాయింట్ కలెక్టర్ ఆసరా  గంగాధర్ గౌడ విచారణ చేయించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. కదిరి ఇన్చార్జి తాసిల్దార్ గా  కదిరి డిప్యూటీ తాసిల్దార్ గా   నియామకము ఉత్తర్వులు  జిల్లా కలెక్టర్  జారీ చేశారు.