జిల్లాకు వరదల వల్ల ఎన్నడూ లేని విధంగా భారీ నష్టం జరిగిందని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది

  చిత్తూరు డిసెంబర్ 2  (ప్రజాాఅమరావతి) : చిత్తూరు జిల్లాకు వరదల వల్ల ఎన్నడూ లేని విధంగా భారీ నష్టం జరిగిందని ప్రభుత్వం అన్ని విధాలుగా  ఆదుకుంటుందని


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు .ఏర్పేడు మండలం పాపా నాయుడు పేట నుంచి గుడిమల్లం మీదుగా వెళ్లే స్వర్ణముఖి నది మీద నిర్మించిన బ్రిడ్జి ఇటీవల వరదలకు కొట్టుకుపోగా ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి రోడ్లు భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖ,  ఏపీ ట్రాన్స్కో, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా జరిగిన నష్టాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్ వివిధ శాఖా ధికారులతో కలసి వివరించారు. అనంతరం గుడిమల్లం కు వెళ్లే బ్రిడ్జి స్వర్ణముఖి నది దాటి కి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. అదేవిధంగా నదీ ప్రవాహం వల్ల పదహైదు గ్రామాలకు రాకపోకలు లేవని అదే విధంగా పలు భూములు కూడా ప్రవాహం ధాటికి కొట్టుకుపోయాయని ఆ భూములను కూడా ముఖ్యమంత్రికి చూపించారు. మొత్తం 195 మీటర్లు గల బ్రిడ్జి కొట్టుకు పోయిందని, తాత్కాలిక మరమ్మతులకు కోటి రూపాయలు ఖర్చు అవుతుందని, శాశ్వతంగా నిర్మించేందుకు 20 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.  ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా ఇన్చార్జి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, గురుమూర్తి, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్,  శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, ఎం ఎస్ బాబు, వెంకటే గౌడ,నవాజ్ భాష, చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీ భరత్, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.