కొల్లిపర (ప్రజా అమరావతి); రబీ సీజన్లో రైతులకు నాణ్యమైన జొన్న, మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలు సరసమైన ధరలకు అందుబాటు లో ఉంచే కొరకు ఈ రోజు గురువారం కొల్లిపర మండలం లోని విత్తనాల షాపులను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో అత్తోట గ్రామం నందు నవయుగ ఫెర్టిలైజర్స్ నందు 107.28 క్వింటాలు, విలువ 24 లక్షల 95000 హైబ్రిడ్ మొక్కజొన్న, జొన్న సరైన రికార్డులు లేకుండా వ్యాపారం నిర్వహించి నందున అమ్మకాలు నిలుపుదల చేసినారు. విత్తన డీలర్స్ తప్పనిసరిగా అధికృత కంపెనీలు/డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేయాలి. రైతులు తప్పని సరిగా విత్తన డీలర్ల నుండి బిల్లులు పొందాలి. ఎమ్మార్పీ ధరలు కు మించి అమ్మ రాదని విత్తన డీలర్లకు హెచ్చరించడం అయినది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీ బాలాజీ గంగాధర్ పాల్గొన్నారు.
రైతులకు సరసమైన ధరలకే విత్తనాలను అందించాలి
addComments
Post a Comment