విజయవాడ (ప్రజా అమరావతి); కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నాగేంద్ర నాథ్ సిన్హా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా డిసెంబర్31, 2021 అంటే శుక్రవారం రాష్ట్ర ఉన్నాతాధికారులతో విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రూర్భాన్ అమలు తీరు తెన్నులు, సాధించిన ప్రగతి తదితర అంశాలపై పిపిటి రూపంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఆయనకు వివరించారు.
ఉపాధి హామీ పథకానికి సంబంధించి రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, అరకు లాంటి ప్రాంతాల్లో కాఫీ పంటకు అనుమతి౦చాలని, అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణానికి అవసరమైన నిధులను రూ.5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు పెంచాలని ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నాగేంద్ర నాథ్ సిన్హా కు విజ్ఞప్తి చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నాగేంద్ర నాథ్ సిన్హా మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు నేతృత్వంలో జరిగే దిశ సమావేశాలు క్రమం తప్పకుండా జరగాలని, సమావేశాల నిర్వహణకు ఒక క్యాలెండర్ రూపొందించుకోవాల
ని అన్నారు. చెంచులకు ఉపాధి హామీ కార్యక్రమం అమలు తీరు బాగుందని అయితే మరింత సమగ్ర ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందించుకుని అమలుపరచాలని, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్ల శిక్షణ కార్యక్రమ వ్యవధిని పెంచుకుని మరింత మెరుగ్గా శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా అభివృద్ధి పరుస్తున్న పండ్ల తోటల్లో వేసే అంతర పంటలకు అధిక ఆదాయం వచ్చేలా, రైతులకు మరింత ఉపయోగకరంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని అంటూ రూర్భాన్ లో చేపట్టే పనులను అనుసంధాన భావనతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని నాగేంద్ర నాథ్ సిన్హా అన్నారు. మెటీరియల్ వాటాను ప్రస్తావిస్తూ అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు సమానంగా వెళ్ళేలా చూసుకోవాలని గ్రామీణాభివృద్ధి అధికారులకు ఆయన సూచించారు.
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల వివరణను, సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నాగేంద్ర నాథ్ సిన్హా అభినందించారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మన రాష్ట్రానికి 23.5 కోట్ల పనిదినాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆమోదించగా కూలీలకు ఇప్పటికే 21.67 కోట్ల పనిదినాలను కూలీలకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కల్పించింది. కాగా రూ. 8,811 కోట్ల నిధులు ఖర్చు కాగా అందులో వేతనాల రూపంలో రూ. 4,937 కోట్లు, మెటీరియల్ రూపంలో రూ. 2,448 కోట్లు వెచ్చించారు.
సిసిఎల్ఎ నీరబ్ కుమార్ ప్రసాద్, హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, హౌసింగ్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ గుప్తా, పంచాయతీరాజ్ ఈఎన్.సి సుబ్బారెడ్డి తదితరులు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నాగేంద్ర నాథ్ సిన్హాను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మించిన మేట్- ఆంధ్రప్రదేశ్ ఏ స్టాల్ వార్ట్ వర్కింగ్ ఫర్ 100 పర్సెంట్ మహిళా పవర్, ఏ స్టెప్ టువర్డ్స్... ఏ గ్రీన్ ఎ పి త్రూ మహాత్మా గాంధీ నరేగా ఫిల్మ్ లను ఆయన ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ఇజిఎస్ సంచాలకులు పి. చినతాతయ్య జాయింట్ కమిషనర్ లు ఎం. శివ ప్రసాద్, ఎ.కళ్యాణ చక్రవర్తి, దేవమునిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment