కాకాణి చేతుల మీదుగా మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ"

 *" కాకాణి చేతుల మీదుగా మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ"*




శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ఈపూరు గ్రామంలో మహనీయులు బి.ఆర్.అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, ప్రియతమ నేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గార్ల విగ్రహాలను ఆవిష్కరించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .




 మహానీయులు, చరిత్రకారులైన బి.ఆర్.అంబేడ్కర్ గారు, మహాత్మ జ్యోతిరావు పూలే గారు, మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గార్ల విగ్రహాలను ఆవిష్కరించిన ఈ రోజు నా జీవితంలో మరపురానిది.


 మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి, మనకు అందించి, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించబడిన మన భారతదేశం, ఈనాడు అభివృద్ధి దిశగా ప్రయాణించడానికి ప్రధాన కారకులయ్యారు.


 మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, మహిళల సంక్షేమం కోసం, తమ జీవిత సర్వస్వాన్ని సమాజ సేవకు అంకితం చేసి, సంఘ సంస్కర్తలుగా ప్రజల మనసులలో నిలిచిపోయారు.


 మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి, ప్రజల హృదయాలలో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు.


 మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బి.ఆర్.అంబేడ్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి బాటలో పయనిస్తూ, మహిళలకు అత్యంత  ప్రాధాన్యతను కలిగిస్తూ, అణగారిన వర్గాలకు రాజ్యాధికారాన్ని అప్పజెప్పారు.


 గ్రామస్తులు అందరూ ఒకే తాటిపై నిలిచి, గ్రామ పెద్ద అనంతరాజు వేణుగోపాల్ గారితో కలిసి, గ్రామంలో సమాజ శ్రేయస్సు కోసం పని చేసిన మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం.


 మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, వారి లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ ఆశీస్సులు అందించి అండగా నిలవాలి.


 సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యునిగా రెండు సార్లు అవకాశం కల్పించి, మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టే భాగ్యాన్ని ప్రసాదించిన నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

Comments