అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లుతణుకు (ప్రజా అమరావతి);


తణుకులో డిసెంబర్ 21 మంగళవారం "జగనన్న సంపూర్ణ హక్కు పధకాన్ని" లాంఛనంగా ముఖ్యమంత్రి ప్రారంభించడానికి వస్తున్నందున ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షణ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు.


ఆదివారం స్థానిక శాసన సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, తదితరులతో కలిసి ఏర్పాట్లు ను పరిశీలించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలోని  ప్రతిష్టాత్మక మైన జగనన్న సంపూర్ణ హక్కు పధకం  అవిష్కరణకి జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న దృష్ట్యా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు


ను పర్యవేక్షణ చెయ్యడం జరిగిందన్నారు. డిసెంబర్ 21 వ తేదీ న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు  అవ్వడంతో ఎక్కువ మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపేందుకు వొచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ఆ సందర్భాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని అన్ని రకాలుగా ముందస్తు భద్రతా ఏర్పాట్లపై స్థానిక శాసన సభ్యులు, రెవెన్యూ, పోలీసు అధికారులు,   ఇతర సమన్వయ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ఉన్న రూట్ ను ఏ ఎస్ ఎల్ లో భాగంగా క్షుణ్ణంగా పరిశీలించామన్నారు.  రూట్ మ్యాప్ లో ఏర్పాటు చేస్తున్న స్వాగత ద్వారాలు, హోర్డింగ్స్, బ్యానర్లు , స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అంశాలపై సూచనలు జారీ చేశామన్నారు. సీఎం పర్యటన కు సంబంధించి ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది , పోలీసు అధికారులతోమార్పు చేర్పులపై చర్చించామన్నారు. హెలిప్యాడ్, జిల్లా పరిషత్ స్కూల్ వద్ద  వి ఐ పి లు, ప్రజా ప్రతినిధులచే స్వాగతం పలికే క్రమంలో ప్రోటోకాల్ మేరకు చర్యలు చేపడుతున్నా మన్నారు. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు రహదారి పొడవునా ప్రజలచే అభివాదం చెసే నిమిత్తం బారి కెట్లు ఏర్పాటు చేస్తున్న ట్లు తెలిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న  అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రతిభంబించేలా ప్రదర్శన స్టాల్స్ , సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చెస్తున్నట్లు కార్తికేయ మిశ్రా తెలిపారు. గృహ రుణాలు పూర్తిగా చెల్లించిన లబ్దిదారులకి, ఓటీఎస్ లబ్దిదారులకి రిజిస్ట్రేషన్ పత్రాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకి అందచెయ్యనున్నట్లు పేర్కొన్నారు.  సుమారు రెండు కిలోమీటర్లు మేర రూట్ మ్యాప్ ప్రకారం నడుచుకుంటూ ఏ ఎస్ ఎల్ బృందం సుమారు 90 నిమిషాలు పాటు పర్యటించారు.


ఈ తనిఖీలో శాసన సభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, జేసి లు డా.బీఆర్ అంబేద్కర్, హిమాన్షు శుక్లా, సూరజ్ గానేరో,  ఆర్డీవో ఎస్. మల్లిబాబు, డిఎస్పీ కొవ్వూరు బి. శ్రీనాధ్, పీడీ హౌసింగ్, పీడీ డిఆర్డీఏ, పీడీ ఐసీడీఎస్, ఎస్సి ఆర్ అండ్ బి, జిల్లా, డివిజన్,  మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.