తాడేపల్లి (ప్రజా అమరావతి); కె.ఎల్.విశ్వవిద్యాలయంలో వ్యాయామ విభాగం ఆధ్వర్యంలో సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయ పురుషుల బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా ముగిసాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ మాజీ కార్యదర్శి పున్నయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ తమకిష్టమైన రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుపొందిన క్రీడాకారులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు.చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యమని, ప్రతిరోజు ఒక గంట సమయం క్రీడలకు కేటాయించాలని తెలిపారు. క్రీడలతో ఆరోగ్యంగా ఉండవచ్చని, జబ్బుల నుంచి దూరం అవుతామని చెప్పారు.క్రీడాకారులు తమ కి ఇష్టమైన క్రీడల లో రాణిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలవొచ్చని తెలిపారు. క్రీడాకారులు క్రీడా నైపుణ్యంతో ఒలంపిక్స్‌లో పతకాలు సాధించాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకోవడం ద్వారా మీలో ఉన్న ప్రతిభ భయట పడుతుందని తెలిపారు. క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు, మంచి భవిష్యత్‌ను కూడా ఇస్తుందని స్పష్టం చేశారు.విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆకాంక్షించారు. కె.ఎల్.విశ్వవిద్యాలయం చదువు తో పాటు క్రీడలకు కూడా చాలా ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.మిగిలిన రంగాలతో పోలిస్తే క్రీడల్లో రాణించిన వారికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తుందని ఆయన తెలిపారు.చివరి రోజు జరిగిన పోటీల్లో ఎస్.ఆర్.ఎం విస్వవిద్యాలయం పై బెంగళూరు జైన్ విస్వవిద్యాలయం (0-3) తో గెలుపొందారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ సారధి వర్మ,విద్యార్ధి విభాగ సంక్షేమ అధిపతి డీన్ డాక్టర్ కే.ఆర్.ఎస్.ప్రసాద్,అడ్వైసర్ డాక్టర్ హాబీబుల్లా ఖాన్, అసోసియేట్ డీన్(ఆటలు మరియు క్రీడలు) డాక్టర్ కే.హరికిషోర్, వ్యాయామ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
Post a Comment