నెల్లూరు (ప్రజా అమరావతి);
ప్రభుత్వ కార్యాలయాలలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలపై శనివారం సాయంత్రం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టరు
శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, ఉద్యోగుల నుండి వారి సమస్యలపై వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు మాట్లాడుతూ, ఉద్యోగుల నుండి పలు
సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్ధేశించిన గడువు లోపు పరిష్కరించేందుకు తగు చర్య తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వచ్చిన ఆర్జీ పై సంబంధిత శాఖల జిల్లా అధికారులు తీసుకున్న చర్యలపై నివేదిక కలెక్టరేట్ కు అంద చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, అధికారులను ఆదేశించారు.
ఈ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు శ్రీ హరేందిర ప్రసాద్, శ్రీ విధేహ్ ఖరే, నెల్లూరు నగర మునిసిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీమతి రోజ్ మాండ్, డి.ఎఫ్.ఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓబులేసు, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ శ్రీ శ్రీనివాసరావు, డి.పి. ఓ శ్రీమతి ధనలక్ష్మి, డ్వామా పి.డి శ్రీ తిరుపతయ్య, డి.ఈ.ఓ శ్రీ రమేష్ కుమార్, ఇరిగేషన్ ఎస్.ఇ శ్రీ కృష్ణమోహన్, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్.ఇ శ్రీ శ్రీనివాసరావు, డి.ఎస్.డబ్ల్యూ.ఓ శ్రీ వెంకటయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment