అభివృద్ధి ఒక ప్రాంతానికే పరిమితమైతే నష్టపోతాం



- మూడు రాజధానులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి జరగాల్సిందే 

- వైఎస్సార్ బతికుంటే రాష్ట్రం ముక్కలయ్యేది కాదు 

- అభివృద్ధి ఒక ప్రాంతానికే పరిమితమైతే నష్టపోతాం 


- సీఎం జగన్ ఏ కార్యక్రమం చేసినా పేదల కోసమే 

- 30 వేల మందిని కోటీశ్వరులను చేయడానికి కాదు 

- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 



గుడివాడ, డిసెంబర్ 21 (ప్రజా అమరావతి): మూడు రాజధానులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరగాల్సిందేనని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) స్పష్టం చేశారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని అలంకృత ఫంక్షన్ హాల్లో జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయేది కాదని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ మరణంతో పేదలకు ఆర్ధిక ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు లో అమరావతిని గ్రాఫిక్స్ లలో మాత్రమే చూపించారన్నారు. అధికారం పోయిన తర్వాత తిరుమలకు పాదయాత్ర చేసి శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరారన్నారు. అయితే శ్రీవారి ఆశీస్సులు ఆ శివుడు కొలువై ఉండే అమరావతికి ఉంటాయని, రియల్ ఎస్టేట్ కోసం ఏర్పాటు చేసుకున్న, శని చంద్రబాబు ఉండే ఈ అమరావతికి ఉండవన్నారు. 30 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్న ప్రాంతంలో రాజధాని ఉంటే పేదప్రజలు కూడా అక్కడ నివాసం ఉండే అవకాశం ఉంటుందని సీఎం జగన్మోహనరెడ్డి చెప్పారన్నారు. అలా కాకుండా ప్రైవేట్ భూములను సేకరించడం వల్ల అమరావతి ప్రాంతంలో నయా జమీందార్లను తయారు చేసినట్లు అవుతుందని జగన్మోహనరెడ్డి పదేపదే అసెంబ్లీ సాక్షిగా చెబుతూ వచ్చారన్నారు. అయితే మూడు డబ్బా ఛానళ్ళు, చెత్త పేపర్లు, చంద్రబాబు బూట్లు నాకే తోక పార్టీలు మాత్రం జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే అమరావతిని వ్యతిరేకిస్తున్నట్టుగా చిత్రీకరిస్తూ వస్తున్నారన్నారు. దీనిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, 30 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నచోట రాజధానిని ఏర్పాటు చేయాలని జగన్మోహనరెడ్డి అనలేదని నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని సవాల్ విసిరారు. 55 వేల మంది పేదలు అమరావతిలో ఉండకూడదనే ఉద్దేశ్యంతో కోర్టులో కేసులు వేసింది ఎవరని ప్రశ్నించారు. సీఎం జగన్మోహనరెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా పేదలను దృష్టిలో పెట్టుకుంటారని గుర్తుచేశారు. గుడివాడ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని, మరో నాలుగుసార్లు గెలుస్తానంటూ సగర్వంగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాల్సిందేనని, కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైతే మిగతా ప్రాంతాల వారు నష్టపోవాల్సి ఉంటుందని గత అనుభవాలను వివరించారు. కేవలం 30 వేల మందిని కోటీశ్వరులను చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని, అన్ని ప్రాంతాల్లోని ప్రజలందరూ ప్రభుత్వానికి సమానమేనని మంత్రి కొడాలి నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, జిల్లా కలెక్టర్ జే నివాస్, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ కే మాధవీలత , శ్రీవాసు నుపూర్ అజయకుమార్, కే మోహనరావు, జడ్పీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, ఎంపీపీలు పెయ్యల ఆదాం, జీ పుష్పరాణి, గుడివాడ ఆర్డీవో జీ శ్రీసుకుమార్, మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్, హౌసింగ్ పీడీ కే రామచంద్రన్, ఈఈ శ్రీదేవి, డీఈ రామోజీనాయక్, వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, నాయకులు ఉప్పాల రాము, మండలి హనుమంతరావు, పాలేటి చంటి, మట్టా జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Comments