టిటిడిలో ఉద్యోగాలంటూ సామాజిక మాధ్యమాల ప్రకటనలు నమ్మకండి : టిటిడి

 టిటిడిలో ఉద్యోగాలంటూ సామాజిక మాధ్యమాల ప్రకటనలు నమ్మకండి : టిటిడి

తిరుపతి,  డిసెంబర్ 05 (ప్రజా అమరావతి): టిటిడిలో ఉద్యోగాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని చేస్తున్న అవాస్తవ ప్రకటనలను న‌మ్మి మోస‌పోవ‌ద్ధ‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది.

గతంలో టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది ద‌ళారులు మోసపు మాటలు చెప్పి కొంతమంది అమాయకుల నుండి డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది.

టిటిడిలో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ చేప‌ట్టేట‌ప్పు‌డు ముందుగా ప‌త్రిక‌ల్లో, టిటిడి వెబ్‌సైట్‌లో అధికారిక  ప్ర‌క‌ట‌న (నోటిఫికేషన్) ఇవ్వ‌డం జ‌రుగుతుంది. ఇలాంటి విషయాలపై టిటిడి గతంలో కూడా ప్రజలకు స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా  ఉండి అవాస్తవ ప్రకటనలు నమ్మవద్దని టిటిడి కోరుతోంది. ఇలాంటి అవాస్తవ ప్రచారం చేసేవారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Comments