లబ్ధిదారులకు అవసరమైన చిన్న స్థాయి రుణాలు అందజేయాలని కోరారు

                     

నెల్లూరు (ప్రజా అమరావతి);



స్వయం సహాయక గ్రూపు సభ్యులు వారి ఖాతాల నుండి డబ్బులు ఉపసంహరించే సందర్భంలో బ్యాంకులు ఎటువంటి ఆటంకాలు కల్పించ వద్దని జిల్లా కలెక్టర్ శ్రీ  కె.వి.యన్ చక్రధర్ బాబు బ్యాంకులను ఆదేశించారు.


     శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ వై వి రాం ప్రసాద్ రెడ్డి రాబోవు ఖరీఫ్ సీజన్ రబీ సీజన్లో పంటల  వర్కింగ్ క్యాపిటల్ అవసరాల గురించి వివరించారు. ఈ సమావేశంలోజిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఈ నెల డిసెంబర్ 21వ తేదీన ఆయా లబ్ధిదారులకు జగనన్న శాశ్వత గృహ హక్కు పత్రాలు అందజేస్తున్నారని, అందుకు అనుగుణంగా బ్యాంకర్లు ఆయా లబ్ధిదారులకు అవసరమైన చిన్న స్థాయి రుణాలు అందజేయాలని కోరారు



. వివిధ రకాల లబ్ధి దారులు ప్రభుత్వ ఖాతా కు నగదు జమ చేయు సందర్భంలో పాన్ కార్డు కొరకై వత్తిడి చేయవద్దని బ్యాంకర్లను సూచించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాంకులు స్వయం సహాయక గ్రూపులు నుండి నగదు ఉపసంహరణకు అనువుగా తగినంత నగదు నిల్వలు సిద్దంగా  ఉంచుకోవాలని కోరారు. జగనన్న శాశ్వత గృహ హక్కు పత్రాలు హామీగా పెట్టుకొని లబ్ధిదారులకు విరివిగా రుణాలు అందించాలని  బ్యాంకర్లను కోరారు. 

ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు , బ్యాంకర్లు  పాల్గొన్నారు.

Comments