ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి

 

నెల్లూరు, డిసెంబర్ 28 (ప్రజా అమరావతి): ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని


రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ ఎం విక్టర్ ప్రసాద్ పేర్కొన్నారు.  ఒకరోజు జిల్లా పర్యటనకు విచ్చేసిన  ఆయనను మంగళవారం సాయంత్రం నెల్లూరులోని  పినాకిని అతిథిగృహంలో జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు, ఎస్పి శ్రీ విజయ రావు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి రోజ్ మాండ్, డి ఆర్ వో శ్రీ చిన్న ఓబులేసు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. 

  తొలుత ఎస్సీ కమిషన్ చైర్మన్ కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి  నివాళులర్పించారు. తదుపరి నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ నుంచి వి ఆర్ సి కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

అనంతరం పినాకిని అతిథిగృహంలో ఆయన కలెక్టర్, ఎస్పి ఇతర అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలని, ఎస్సీల భూ సమస్యలు, కుల ధ్రువీకరణ పత్రాల మంజూరు తదితర అంశాల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 

 అనంతరం పలు సమస్యలపై ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులు అందజేసిన అర్జీలను ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ యమ్ విక్టర్ ప్రసాద్ స్వీకరించారు.

  ఈ పర్యటనలో  జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి శ్రీ చెన్నయ్య, ఆర్ డి ఓ శ్రీ హుస్సేన్ సాహెబ్, ఎస్సీ ఎస్టి కుల సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.