గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిధం.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);          పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది మనరాష్ట్రంలోని గ్రామీణ పేదలకు గత సంవత్సరం కంటే ఎక్కువ పనిదినాలు కల్పించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. దాదాపు 45 లక్షల కుటుంబాలు ఉపాధి హామీ పథకంను వినియోగించుకుంటున్నాయి. అంతేకాకుండా మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపడుతున్న పనుల ద్వారా కూడా పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తోంది. ఇటువంటి పథకాన్ని మరింత సద్వినియోగం చేసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించుకు


నే వీలు ఉంది. ప్రతి గ్రామంలోనూ కనీసం అయిదు భవనాలు అయినా సరే ఉపాధి హామీ కింద చేపట్టేలా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నాం. 

ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ సాఫ్ట్‌ వేర్‌ లో నమోదవుతున్న పనులు ఈ ఏడాది కేంద్రప్రభుత్వం నిర్ధేశించిన సాఫ్ట్ వేర్‌ ద్వారా నమోదు చేస్తున్నాం. దీనివల్ల గతంలో రాష్ట్రం మొత్తం ఒక యూనిట్‌గా తీసుకుంటే, తాజా మార్పు వల్ల ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా గుర్తించి పనుల నమోదు చేయాల్సి వస్తోంది. సాంకేతికంగా దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఉపాధి హామీ పనులకు చెల్లింపుల్లో గతంలో వివిధ కారణాల వల్ల జరిగిన  జాప్యం కూడా లేకుండా ఇప్పుడు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇటువంటి మంచి పథకం అమలులో నరేగా కౌన్సిల్ సభ్యులు మరింత బాధ్యతతో పనిచేయాలి. పని దినాల కల్పన, మెటీరియల్ కాంపోనెంట్ కింద జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించి, పనుల్లో అలసత్వం లేకుండా చూడాల్సిన బాధ్యత కౌన్సిల్ సభ్యులపై ఉంది. సదరు పనులు చేపడుతున్న గ్రామ పంచాయతీలు, కాంట్రాక్టర్‌లను మోటివేట్ చేయడం క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావాలి. 

కొన్ని జిల్లాల్లో లేబర్ కాంపోనెంట్ తక్కువగా నమోదువుతోంది. అటువంటి జిల్లాల్లో కౌన్సిల్ సభ్యులు పర్యటించి గ్రామీణ పేదలు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసుకునేలా చైతన్యవంతం చేయాలి. క్షేత్రస్థాయిలో నరేగా పథకం మరింత పకడ్భందీగా అమలు జరిగేలా చూసేందుకు కౌన్సిల్ సభ్యుల సలహాలు, సూచనలను ఎప్పటికప్పుడు స్వీకరిస్తాం. ఇందుకోసం ప్రతి మూడు నెలలకు ఒక సారి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, నరేగా డైరెక్టర్ చిన్నతాతయ్య,  కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.