అంగన్వాడీ ఆయా, సహాయకులు, టీచర్ పోస్టుల భర్తీ ని అత్యంత పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని ఆర్డీవో ఎస్. మల్లుబాబు, తెలిపారు.
కొవ్వూరు (ప్రజా అమరావతి);


కొవ్వూరు, గోపాలపురం, పోలవరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అంగన్వాడీ ఆయా, సహాయకులు, టీచర్ పోస్టుల భర్తీ ని అత్యంత పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని ఆర్డీవో ఎస్. మల్లుబాబు,  తెలిపారు.స్థానిక ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం మూడు ప్రాజెక్ట్ లకు చెందిన అంగన్వాడీ కేంద్రాల అంగన్వాడీ కార్యకర్త లు,   ఆయా (సహాయకులు) పోస్టు లకు, అంగన్వాడీ టీచర్ పోస్టు పదోన్నతులకి  ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, గత రెండు రోజులుగా కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఈ రోజు ఐసీడీఎస్ ఆరు ప్రాజెక్ట్ లకు చెందిన తొమ్మిది మండలాల్లో అంగన్వాడీ కేంద్రాలలో సిబ్బంది కొరత లేకుండా పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకం కోసం ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. ఈపోస్ట్ ల కోసం  దరఖాస్తు చేసుకున్న  మహిళలకు ఇంటర్వ్యూలో వారి సామర్ధ్యం, నైపుణ్యం పై ఇంటర్వ్యూ చెయ్యడం జరిగిందనితెలిపారు. 


 ఈ అంగన్వాడీ కేంద్రాలలో పనిచేసే సిబ్బందికి అంకితభావం, సేవ గుణం కలిగి ఉండడం తో పాటు పిల్లల సంరక్షణ , ఇంగ్లీషు లో కనీస పరిజ్ఞానం అంశాలపై సూచనలు చెయ్యడం జరిగిందన్నారు. 

మొత్తం ఈరోజు నిర్వహించిన ఇంటర్వ్యూలో కొవ్వూరు, తాళ్లపూడి, గోపాలపురం, దేవరపల్లి మండలాలకు చెందిన  నాలుగు అంగన్వాడీ ఆయా,19  సహాయకుల పోస్ట్ ల నియామకాలకు,  3 టీచర్ పోస్టుల  పదోన్నతుల భర్తీ కోసం ఇంటర్వ్యూలను నిర్వహించామని తెలిపారు. మొత్తం 107 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరైనట్లు అధికారులు తెలిపారు

 


ఈ ఇంటర్వ్యూలను ఐసీడీఎస్ పీడీ కె. విజయ కుమారి, ఏన్జివో  డాక్టర్ కె. సత్యవతి, తో పాటు సంబంధించిన మండల సీడీపీఓ లు, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.