శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి,

 శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి):  

      భవానీ దీక్షా మహోత్సవములు-2021 విజయవంతముగా ముగిసిన సందర్భంగా ఈరోజు అనగా ది.31 - 12-2021  ఉదయం  మల్లిఖార్జున మహామండపము 6 వ అంతస్తు నందు  ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు  మరియు శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ  గారిచే  ప్రెస్ మీట్ నిర్వహించబడినది. ఈ సందర్భముగా చైర్మన్    మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ  మాట్లాడుతూ భవానీ దీక్ష మహోత్సవములు విజయవంతముగా జరిపించుటకు సహకిరించిన ప్రభుత్వ,  దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమీషనర్ గారికి, రెవిన్యూ, పోలీసు, వైద్య, మునిసిపల్ మరియు అన్ని శాఖల సిబ్బందికి, దేవాదాయశాఖ మరియు ఆలయ సిబ్బందికి, మీడియా మిత్రులకు మరియు భక్తులకు ప్రతి ఒక్కరికి ధన్య వాదములు తెలిపి, భవానీ దీక్ష విరమణ సందర్భంగా శ్రీ అమ్మవారి దర్శనము చేసుకున్న భక్తుల సంఖ్యా మరియు ఆదాయ, వ్యయ వివరములు తెలియజేశారు. అనంతరం రాబోయే నూతన సంవత్సరం నందు కరోనా మహమ్మారి పూర్తిగా తొలగి పోయి ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీ అమ్మవారి, స్వామి వార్లను ప్రార్థిస్తున్నట్లు తెలిపి  శుభాకాంక్షలు తెలియజేశారు ..


ఈ కార్యక్రమం నందు పాలకమండలి సభ్యులు శ్రీ లింగంభొట్ల దుర్గా ప్రసాద్ గారు,  శ్రీమతి ఎన్. అంబికా , ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ , కార్యనిర్వాహక ఇంజినీర్ శ్రీ డి.వి.భాస్కర్ , శ్రీమతి లింగం రమాదేవి , సహాయ కార్యనిర్వహణాధికారులు శ్రీ బి.వెంకట రెడ్డి , శ్రీ ఎం.తిరుమలేశ్వర రావు  మరియు సిబ్బంది పాల్గొన్నారు..