నెల్లూరు (ప్రజా అమరావతి);
జిల్లాలో చేపట్టిన గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ లు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయుటకు ప్రత్యేక శ్రద్ద
తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) శ్రీ గణేష్ కుమార్ తో కలసి ఎన్ఆర్ఈజిఎస్ పనులు, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు, డా.వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ల నిర్మాణాల పురోగతిపై పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు మరియు జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంకా మొదలు కానీ గ్రామ సచివాలయాలు, ఆర్.బి.కె.లు, వై.ఎస్.ఆర్. హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలు ఈ నెలాఖరు నాటికి మొదలు పెట్టాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. 2022 మార్చి నాటికి జిల్లాలో చేపట్టిన భవన నిర్మాణాలన్నీ కచ్చితంగా పూర్తి చేయుటకు పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు కృషి చేయాలన్నారు. డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణాలపై కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ, గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులు త్వరగా పూర్తిచేయుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ , జిల్లా నీటి యాజమాన్య సంస్థ పి.డి. ని ఆదేశించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనుల్లో లేబర్ కాంపొనెంట్ పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ ఎస్.ఈ శ్రీ సుబ్రమణ్యం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ తిరుపతయ్య, పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment