అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించి

 అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ ఎస్ . నాగలక్ష్మిఅనంతపురం ,డిసెంబర్ 6 (ప్రజా అమరావతి):

భారత రాజ్యాంగ నిర్మాత  బాబా సాహెబ్ అంబేద్కర్ 65  వవర్ధంతి సందర్భంగా సోమవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న డా " బి.ఆర్ .అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించి


భారత రాజ్యాంగాన్ని అందించిన అపర మేధావి డా.బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారునేడు ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు. నేటి యువత అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విధంగా ముందుకెళ్లాలని పేర్కొన్నారు.ముఖ్యంగా దేశానికే దిశా నిర్దేశం చేసిన ప్రపంచ మేధావి భారతరత్న డా..బి.ఆర్.అంబేద్కర్ అని తెలిపారు

చిన్నతనంలోనే సామాన్యులు పడుతున్న బాధలను గుర్తించి, రిజర్వేషన్లు లేకుంటే సమానత్వం రాదనే ఉద్దేశ్యంతో యస్.సి, యస్.టి, బి.సి, ఇ.బి.సి, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలనే సత్సంకల్పంతో భారత రాజ్యాంగాన్ని రచించి, అందులో పొందుపరచడం జరిగిందన్నారు. డా. బి.ఆర్.అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలలోనే అత్యంత ఉత్తమమైనదని అన్నారు. ఇస్లామిక్ దేశాల్లో మతమే రాజ్యాంగమని, కాని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మనదేశం గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థకు దిక్సూచి అని  ఆమెతెలిపారు. అటువంటి దేశానికి ఒక దశ, దిశలను నిర్ధేశించడమే కాకుండా వారికి సమానత్వాన్ని కల్పించిన ఘనత అంబేద్కర్ దేనని  వివరించారు. 

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం)గంగాధర గౌడ్, ఆర్డీఓ మధుసూధన్,డి. డి. విశ్వమోహన్ రెడ్డి, తహసీల్దార్ మోహన్ కుమార్, ఎస్సి, ఎస్టీ,  మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.