కొవ్వూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమం
కొవ్వూరు (ప్రజా అమరావతి) ;  


కొవ్వూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమం


లో పెట్రోల్ బంకు యాజమాన్యాలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయం అని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు.


శనివారం కొవ్వూరు లో ఉన్న పెట్రోల్ బంకు ల ప్రతినిధులు పార్కుల అభివృద్ధి కోసం చేస్తున్న పనులను ఆయనకు వివరించారు. 

ఈ సందర్భంగా మల్లుబాబు మాట్లాడుతూ, కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక బాధ్యతగా స్వచ్ఛందంగా ముందుకు రావడం మరికొందరికి స్ఫూర్తిని కల్పింస్తుందని తెలిపారు. 


ఆర్డీవో ని కలిసిన వారిలో ఐ ఓ సి ..రొంగల శ్రీనివాస్, బిపిసి మోతిలాల్ రూప్ చంద్, హెచ్ పి .. ఎస్ వివి ఉషా సత్యనారాయణ, కాకర్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

.