తణుకు, పశ్చిమగోదావరి జిల్లా (ప్రజా అమరావతి);
*జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం*
*పశ్చిమగోదావరి జిల్లా తణుకులో లాంఛనంగా రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్*
*ఈ సందర్భంగా మాట్లాడిన గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు, లబ్ధిదారులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*
*శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహనిర్మాణ శాఖ మంత్రి*
ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో సుదినం. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు పుట్టినరోజున తణుకులో ఈ పథకం ప్రారంభించడం మన అదృష్టం. మన సీఎంగారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఎంతోమంది అక్కచెల్లెమ్మలు తమ ఇళ్ళ డాక్యుమెంట్లు లేవని, రికార్డులు లేవని ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. ఆయన ముఖ్యమంత్రి అవగానే 32 లక్షల మందికి ఇళ్ళ స్ధలాలు ఇచ్చారు. మన ఏరియాలో ఎకరం కోటి నుంచి రెండు కోట్లు ఉంటే రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ చేశారు. అందులో 25 శాతం డబ్బు మన జిల్లాకు ఇచ్చారు. రూ. 4 లక్షల కోట్ల సంపదను పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. సంపూర్ణ గృహ హక్కు పధకం క్రింద 52 లక్షల మందికి డాక్యుమెంట్లు ఇవ్వడంపై సరాసరి రూ. 8 లక్షల నుంచి రూ.10 లక్షలు అనుకున్నా మరో రూ. 4 లక్షల కోట్ల సంపద ఇస్తున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నేను ఎమ్మెల్యేగా చేశాను. నాడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ళు కట్టించారు. మీరు మరో రెండు అడుగులు ముందుకేసి ఒకేసారి 32 లక్షల మందికి ఇళ్ళ స్ధలాలు ఇవ్వడమే కాక ఇల్లు కట్టిస్తున్నారు. సుమారు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల విలువైన ఇంటి డాక్యుమెంట్స్ నామమాత్రపు రుసుముకే ఇవ్వడం భారతదేశ చరిత్రలో చూడలేదు. మా జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలను ఇవ్వాలని, దేశంలోనే మోడల్ సీఎంగా మీరు ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
*ఎం.సుజాత, లబ్ధిదారు, కృష్ణాయపురం, పశ్చిమ గోదావరి జిల్లా*
అన్నా ముందుగా మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను. జగనన్నా... సంపూర్ణ గృహ హక్కు పథకం కింద నేను లబ్ధిపొందాను. నేను 9 ఏళ్ళ క్రితం ఇల్లు కట్టుకున్నాను, కానీ నా ఇంటిపై ఎలాంటి హక్కు లేదు. నేను హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా హౌసింగ్ లోన్ తీసుకున్నాను, కానీ నాకు హక్కు పత్రం లేదు. మీరు ఈ రోజు నన్ను నా ఇంటికి హక్కుదారుని చేశారు.
అన్నా నేను ఈ పథకం దగ్గరలోని సచివాలయం ద్వారా పొందాను, నేను ఏ అధికారి చుట్టూ తిరగలేదు. దాదాపు రూ. 10 లక్షల విలువైన ఆస్ధిని నేను పొందాను. మీ పుట్టినరోజున కానుకగా ఈ ఆడపడుచుకు ఇస్తున్నారు అన్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నా నా ప్రాణమున్నంత వరకూ ఈ రోజును మర్చిపోను. మాలాంటి పేదవారికి ఈ పథకం ఎంతో ఉపయోగంగా ఉంది. నా భర్తకు ఆరోగ్యం బాగాలేక బయట అప్పులు చేసి వడ్డీలు కట్టి ఇబ్బందులు పడ్డాను. ఇలాంటి ఆస్ధి మా చేతిలో ఉంటే సులువుగా అప్పు దొరుకుతుంది. నాకు అమ్ముకునే హక్కు కూడా ఇచ్చారు, వారసులకు కూడా ఇచ్చే హక్కు ఇచ్చారు, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నా. నేను డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిని, మా గ్రూపుకి డబ్బు వచ్చింది, నా భర్తకు రైతు భరోసా కూడా వచ్చింది, నా పిల్లలకు కూడా ఒకటే చెప్పాను, మీ మేనమామ చదివిస్తారు అని చెప్పాను. వారు చదువుతున్నారంటే మీ దయే. నాడు నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలను చాలా చక్కగా చేశారు. నాకు అమ్మ ఒడి కూడా వచ్చింది, అలాగే మా అమ్మకు కాపు నేస్తం వస్తుంది, మా నాన్నకు వృద్దాప్య ఫించన్ వస్తుంది. నాకు డ్వాక్రాలో వచ్చిన డబ్బులతో రెండు గేదెలు కొనుక్కొని పాలవెల్లువ పధకం కింద పోయడం వల్ల అదనంగా డబ్బులు వస్తున్నాయి. అన్నా మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
*శ్రవణ్‌కుమార్, లబ్ధిదారుడు, తాడేపల్లిగూడెం*
సార్ హ్యపీ బర్త్ డే...నేను టీసీఎస్‌లో పని చేస్తున్నాను, మా నాన్న పెయింటర్, మా అమ్మ గృహిణి. మా కల ఏంటంటే సొంతగా ఇల్లు కట్టుకోవాలని ఉండేది. మేం 2009 లో హౌసింగ్ కార్పొరేషన్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాం, మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. మేం ఈ పథకం ద్వారా వచ్చే లబ్ది తెలుసుకుని సచివాలయంలో రూ. 15 వేలు కట్టాను. 5 నిముషాలలో నా చేతికి లోన్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది. నెల తిరక్కుండానే నేను నా ఇంటి పట్టా తీసుకుంటున్నాను. మా సొంతింటి కల నెరవేరబోతుంది. మీ బర్త్ డే రోజు మీరు మాకు గిఫ్ట్ ఇచ్చారు. మీరు ఈ పథకం ప్రకటించిన తర్వాత మా ఇంటికి కొందరు నేతలు వచ్చి మళ్ళీ మేం అధికారంలోకి రాగానే మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే మీకు పట్టా ఇస్తామన్నారు. నాకు ఆ మాట విని నవ్వు వచ్చింది. మూడేళ్ళ ముందు ఉన్నది కూడా వారే, మూడేళ్ళ ముందు చేయని వారు ఇప్పడు వచ్చిన తర్వాత ఏం చేస్తారు. వారి మాట నేను నమ్మలేదు, మీరు ఎవరైనా నమ్ముతారా. నేను ఆలోచించుకుని ఇంకోసారి ఇలాంటి స్కీమ్ రాదనుకుని డబ్బు కట్టాను. అలాగే పేపర్ వర్క్ గురించి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా అన్నీ చేసి మన ఇల్లు మనం అమ్ముకునే విధంగా చేశారు. చాలా ధన్యవాదాలు సార్. మా చెల్లి కూడా ఉంది. సీఎంగారు మహిళల గురించి ఆలోచించినంత ఎవరూ ఆలోచించలేదు, తనకు విద్యా దీవెన వల్ల మంచి చదువులు చదువుతుంది, తమ్ముడు చదువుకోవడం వల్ల అమ్మ ఒడి వచ్చింది. నాడు నేడు కింద మీరు చేస్తున్న పనులు పదేళ్ళ ముందు ఉండి ఉంటే ఇంకా చదువుకునేవాడిని. మీరు విద్య మీద పెట్టిన దృష్టి ఎవరికీ లేదు, రాదు కూడా. మీ విజన్ చాలా బావుంది. ఓటీఎస్ గురించి అందరూ ఆలోచించండి, ఎవరెన్ని మాటలు చెప్పినా మీరు నమ్మవద్దు. మా యువతకు మీరే ఆదర్శం. మీ ఆలోచనల వల్లే మిమ్మల్ని అందరం అన్నా అని పిలుస్తున్నాం, మీరు మా గురించి అంత ఆలోచించి చేస్తున్నారు. సీఎంగారు ప్రవేశపెడుతున్న పథకాల ద్వారా ప్రతీ ఒక్కరూ అభివృద్ది చెందాలని కోరుకుంటున్నాను. ధ్యాంక్యూ.
addComments
Post a Comment