గుంటూరు (ప్రజా అమరావతి);
"వ్యవసాయ సాంకేతికత 2021 - నూతన వ్యవసాయ సాంకేతికతలపై సదస్సు మరియు ప్రదర్శన ను ప్రారంభించిన వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు
17 -19 డిసెంబర్, 2021 వరకు 3 రోజల పాటు ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ సాంకేతికతలపై సదస్సు మరియు ప్రదర్శన జరగనుంది .
ఈ రోజు ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాం, గుంటూరు ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, పట్టు ప్రిశ్రమ శాఖ, డా. వై. యస్. ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం మరియు శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంల మరియు వివిధ వ్యవసాయ వాణిజ్య సంస్థల సహకారంతో మూడు రోజుల (17 నుండి 19 తేదీల వరకు) వ్యవసాయ సాంకేతికత 2021 - నూతన వ్యవసాయ సాంకేతికతలపై సదస్సు మరియు ప్రదర్శనను గౌరవ రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఆహార శుద్ధి మరియు మార్కెటింగ్ శాఖామాత్యులు శ్రీ కురసాల కన్నబాబు గారు, ముఖ్య అతిధిగా విచ్చేసి
ప్రారంబిచారు .
వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు శ్రీ యo. వి. యస్. నాగి రెడ్డి , విశ్వ విద్యాలయ గౌరవ ఉపకులపతి డా. ఆదాల విష్ణువర్ధన రెడ్డి , డా. వై. యస్. ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం గౌరవ ఉపకులపతి డా. టి. జనకిరామ్ , పాలకవర్గ సభ్యులు – సమాజ విజ్ఞాన శాస్త్ర కళాశాల అసోసియేట్ డీన్ డా. జె. లక్ష్మి గారు, డా. వి. చెంగా రెడ్డి గారు, డా. పి. వి. ఆర్. ఎం. రెడ్డి , పరిశోధనా సంచాలకులు డా. యన్. త్రిమూర్తులు , విస్తరణ సంచాలకులు డా. పి. రాంబాబు , ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీ యస్. యస్. శ్రీధర్ , జిల్లా కలెక్టర్ మరియు మేజిస్టేట్ శ్రీ వివేక్ యాదవ్ ఐ.ఏ.యస్., ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డా. పి. రత్న ప్రసాద్ , వ్యవసాయ శాఖ ప్రతినిధి సంయుక్త సంచాలకులు శ్రీ యo. విజయ భారతి , మరియు వ్యవసాయ మిషన్ శాశ్వత సభ్యులు డా. యామ్. చంద్రశేఖర్ రెడ్డి , మరియు ఆహుతుల సమక్షంలో మంత్రి కన్నబాబు వ్యవసాయ ప్రదర్శనను లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
తదుపరి వ్యవసాయ, పశు వైద్య మరియు ఉద్యాన విశ్వవిద్యాలయం లోని వివిధ పరిశోధనా స్ఠానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పట్టుపురుగుల శాఖ, ఏ. పి. సీడ్స్ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ సందర్శించారు .
వివిధ పంటల, వరి, మొక్కజొన్న, జొన్న, జొన్న, సజ్జా, రాగి, తృణధాన్యాలు – వారీగా, సమలు, కొర్రలు, పప్పు దినుసులు – కంది, మినుము, పెసర, శెనగ, నూనె గింజల పంటలు – వేరుశెనగ, నువ్వులు, ఆముదం, ప్రొద్దుతిరుగుడు, కుసుమ,వాణిజ్యపంటలు, చెరకు, ప్రత్తి వంగాడాలు, కోకో, డ్రాగన్, ఫ్రూట్, నట్ మెగ్ పంట,కొబ్బరి, జామ, మామిడి, దానిమ్మ, సపోటా, ట్యూబరోసే, బంతి, చామంతి, గ్లాడియోలస్,ఆర్చిడ్, గినియ, గిరిరాజ, వనరాజా, కడక నాధ్ కోళ్ళ పెంపకం, రోహు, కట్ల, పండుగబ్బ తదితర చేపలు, టైగర్ రొయ్యలు, పీతలు వాటి చెరువుల యజమ్మన్య పద్దతులు యాజమాన్య పద్దతులు, ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, ద్రోన్ల సాంకేతికత,కలుపుమొక్కలు, చీదపీడలు, కలుపు మొక్కల యాజమాన్యం, సమగ్ర సస్య రక్షణ, సమగ్ర సస్య పోషణ, సామగ్ర ఎరువుల యజమాన్యం, సమగ్ర పంటల యజమాన్యం, పంతకోత తదనంతర సాంకేతికతలు, వివిధ కంపెనీల ట్రాక్టర్లను, పురుగుమందులు, కీటకనాశీనులు, శిలీంద్ర నాశినులు, ఎరువులు, జీవన ఎరువులు, యంత్ర పరికరాలు, పనిముట్లు, జీవ నియంత్రనా పద్దతులు, సాగువిధానాలు, ఆహార ఉత్పత్తులు, విలువజోదింపు విధానాలు మరియు ఉత్పత్తులు, యాజమాన్య పద్దతులు, నూనె గింజల పంటలు, మేత విధానాలు, జీవ నియంత్రణ పద్దతులు, సమాచార కరపత్రాలు, విశ్వవిద్యాలయ ప్రచురణలు తదితరాలను ఆసక్తిగా తిలకించి మంత్రి వాటిగురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సదస్సులో మంత్రి మాట్లాడుతూ, గృహోపకరణ, వాహనాలు తదితరాలకు సంబంధించిన సాంకేతికత క్షణాలలో విశ్రుతస్థాయిలో వాడకం లోకి వస్తుంది కానీ వ్యవసాయ సాంకేతికత లో అలా జరగడం లేదు. దీనికి పరిశోధనా ఫలితాల సాత్వర విస్తరణ అవసరం అన్నారు.
అదేవిధం గా రైతులకు నూతన సాంకేతికత పై శిక్షణ అవసరం అని అన్నారు. అది గుర్తిచే మన ప్రియతమ నాయకులు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై. యస్. జగన్మోహన రెడ్డి గారి రైతు పక్షపాత ప్రభుత్వంలో దీనికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మూడు యంత్రీకరణ శిక్షణా కేంద్రాలను ఒక్కక్కటి సుమారు 15 కోట్ల వ్యయంతో రాయలసీమ, దక్షిణాన్ద్ర మరియు ఉత్తరాoధ్ర ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
వీటీకి రైతులను సందర్శన యాత్రలో భాగం తీసుకొని వెళ్ళి ప్రతి యంత్ర పరికరంపై శిక్షణను వ్యవసాయ మరియు అనుబంధ శాఖలవారు ఇప్పించాలని అన్నారు.
స్వాతంత్ర్యానంతర వ్యవసాయం లో ప్రపంచ వృద్ధిరేటు 2. 32% కాగా, మన దేశ వృద్ధి రేటు 3. 22% అని మరియు మన రాష్ట్ర వృద్ధి రేటు 8. 92% అని అన్నారు.
వై. యస్. జగన్మోహన రెడ్డి ప్రభుత్వం రాష్ట్రములో 10, 778 డా. వై. యస్. ఆర్. రైతు భరోసా కేంద్రాలను తీసుకొని వచ్చి, రైతు మoగడికే, సమాచార కియోస్క్ లద్వారా సమాచార, వాణిజ్యసేవలు, రైతుకు కావలసిన విత్తనం వేసిన దగ్గరనుండి కోత కోసేవరకు అవసరమైన సలహాలను, సూచనలను చేయడమే కాక, వారికి వాణిజ్య సేవలను, బ్యాంకింగ్ సేవలను, ఉత్పత్తి కారకాల సరఫరా మరియు చెల్లింపులు జరిగేలా చేసి, ఆరిని ప్రపంచ మార్కెట్ల తో అనుసంధానిచేలా మన ప్రభుత్వం ఈ - మార్కెట్ సేవలను అందుబాటులోని తీసుకు రావడానికి ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుందన్నారు.
అంతేకాక వీటికి రాష్ట్రo లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ సుమారు 800 మండి శాస్త్రవేత్తతో అనుసంధానించి ముఖ్యంగా సలహాలు, సూచనలు, శిక్షనా మరియు సామర్ధ పెంపు కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు.
ఇప్పటికే, డా. వై. యస్. ఆర్. రైతూ భరోసా , పి. యామ్. కిసాన్ మరియు వై. యస్. ఆర్. జలకళ ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా ప్రణాళికలు రచించి అమలు చేశామన్నారు.
రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపెళ నూత్మెగ్, డ్రాగన్ ఫ్రూట్, ఆర్చిడ్స్ ట్యూబరోసా లాంటి పంటల వైపు వాతావరణాన్ని అనుసరించి ప్రోస్థహించాలన్నారు.
రైతును ఆడుకొనేoదుకు వరద మరియు తుఫాన్ వరద నష్టాలను వెంటనే చెల్లించడం జరుగుతుందని, ఇన్షూరెన్స్ భీమా భారం రైతుకు భారం కాకుండా ఈ - పంట విధానం ద్వారా బీమా కట్టాల్సిన అవసరం లేకుండా చేయడం జరిగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు
రిజిస్ట్రార్ డా. గిరిధర కృష్ణ , విస్తరణ వ్యవసాయ పీఠాధిపతి డా. ఏ. ప్రతాప్ కుమార్ రెడ్డి , వ్యవసాయ ఇంగినీరింగ్ మరియు సాంకేతికత పీఠాధిపతి డా. కె. యెల్లా రెడ్డి , ఉన్నత విద్యాపీఠాధిపతి డా. జి. రామారావు , గృహ విజ్ఞాన పీఠాధిపతి డా. టి. నీరజ , పరీక్షల నియంత్రణాధికారి డా. పి. సుధాకర్ , విద్యార్ధి కార్యకలాపాల పీఠాధిపతి డా. యo మార్టిన్ లూధర్ , క్షేత్రాధికారి శ్రీ పి. వి. నరసింహరావు , సంచాలకులు (విత్తనాలు) డా.ఎ. సుబ్బరామి రెడ్డి , ముఖ్య అధికారి డా. పి. సాంబశివ రావు , సంచాలకులు (పాలిటెక్నిక్స్) డా. ఎ. వి. రమణ , ప్రణాళిక మరియు పర్యవేక్షణ అధికారిణి డా. వై. రాధ , విస్తరణ ప్రధాన శాస్త్రవేత్తలు: డా. టి. గోపి కృష్ణ , డా. బి. ముకుంద రావు, డా. జిఐ. శివనారాయణ , డా. కె. గురవా రెడ్డి , డా. జి. రఘునాధ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment