జంగారెడ్డిగూడెం (ప్రజా అమరావతి);
జగనన్న సంపూర్ణ భూమి హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం అందించే ప్రయోజనాల లబ్దిని పొందాలని
జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి వై వి ప్రసన్న లక్ష్మీ గురువారం ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేశారు.
జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ఐదు మండలాలు, ఒక మునిసిపాలిటీ పరిధిలోని 380 లబ్ధిదారులు రూ.31 లక్షల 87 వేల రూపాయల ను వన్ టైమ్ సెట్టిల్మెంట్ నిమిత్తం చెల్లించడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లో భాగంగా డివిజన్ పరిధిలోని 2, 265 మంది లబ్ధిదారుల ప్రభుత్వం కల్పించే ప్రయోజనం పొందేందుకు స్వచ్ఛందంగా అంగీకారాన్ని తెలపడం జరిగిందని ప్రసన్న లక్ష్మీ పేర్కొన్నారు.
ఈ పథకం కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకు గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది, లేదా రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లపై లబ్ధిదారులకు ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించడమే ఈ పధకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.
డివిజన్ పరిధిలోని మండలాలు వారీగా బుట్టయిగూడెం లో 69 మంది లబ్ధిదారులు రూ.5.50 లక్షలు, జంగారెడ్డిగూడెం లో 114 మంది లబ్ధిదారులు రూ.9.51 లక్షలు, జీలుగుమిల్లి లో 19 మంది లబ్ధిదారులు రూ.1.93 లక్షలు, కొయ్యలగూడెం లో 129 మంది లబ్ధిదారులు రూ.10.84 లక్షలు, పోలవరంలో 29 మంది లబ్ధిదారులు రూ.2.08 లక్షలు ఓటీఎస్ కోసం నగదు చెల్లించడం జరిగిందన్నారు. అదే విధంగా జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీ పరిధిలో 19 మంది లబ్ధిదారులు రూ.2.01 లక్షలు మేర చెల్లింపు లు జరిపినట్లు ఆమె తెలిపారు.
పేద, నిరుపేద కుటుంబాలకు స్వంత ఇంటిపై రిజిస్ట్రేషన్ పత్రాలు పొందేందుకు ఇది ఒక సువర్ణ అవకాశం, ఆ ఇంటిపై, స్థలం పై పూర్తి యాజమాన్య హక్కులు , ఉచితంగా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ లను ఇవ్వడం ఈ పధకం యొక్క ఉదేశ్యం అని తెలిపారు.
addComments
Post a Comment