కొవ్వూరు (ప్రజా అమరావతి);
సీడీఎస్ జనరల్ రావత్ మృతి కి మంత్రి తానేటి వనిత సంతాపం
దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిఖ లతో పాటు మరో 11 మంది సాయుధ బలగాలు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించడం దేశానికి అతిపెద్ద లోటని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
సీడీఎస్ జనరల్ రావత్ మృతి కి మంత్రి గురువారం ఒక ప్రకటన లో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం మన సైనిక బలగాలకు, దేశానికి తీరని లోటు ఆయన తో పాటు ఆయన భార్య మృతి కి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ని వ్యక్తం చేశారు. . ఈ దుర్ఘటనలో గాయపడిన
కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించడం జరిగిందన్నారు. ఈ ఘటన లో మృతి చెందిన సైనికుల కుటుంబాలకు తనప్రగఢ సానుభూతిని తెలిపారు. వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు మనోధైర్యం తో ఉండాలని తెలిపారు..
చిత్తూరు జిల్లా కురబల కోట మండలం రేగడ గ్రామానికి చెందిన సాయితేజ జనరల్ బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ వ్యవహరిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సాయి తేజ ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, ఆయన భార్యకు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ని మంత్రి తెలిపారు.
addComments
Post a Comment