చిట్టీల పేరుతో, డిపాజిట్లు పేరుతో మోసగించినారు

 

ఏలూరు (ప్రజా అమరావతి);

  పశ్చిమ గోదావరి జిల్లా SP గారు శ్రీ రాహుల్ దేవ్ శర్మ, ఐపిఎస్ వారి ఆదేశాలతో ఏలూరు డిఎస్పీ దిలీప్ కిరణ్ ఆధ్వర్యంలో దర్యాప్తు అధికారి ఏలూరు 2 టౌన్ సీఐ డి. వి. రమణ  ఏలూరు MRC కాలనీకి చెందిన తుమ్మపాల ఈశ్వర రావు మరియు 56 మంది ని చిట్టీల పేరుతో, డిపాజిట్లు పేరుతో మోసగించినార


ని ఇచ్చిన ఫిర్యాదు పై కేసు దర్యాప్తులో భాగంగా ముద్దాయిలను అరెస్ట్ చేసినారు.


కేసు వివరాలు: Cr.No. 958/2021 U/s 406, 420 r/w 34 IPC, Sec 76 of Chit Funds Act 1982 and


Sec 5 of Andhra Pradesh Depositors and Financial Establishment Act 1999 ముద్దాయిల వివరాలు..


1. శ్రీరంగం సత్య దుర్గ W/o నాగేశ్వర రావు, 42 సం. లు, కాపు, MRC కాలనీ, తంగెళ్ళమూడి, ఏలూరు, 2. శ్రీరంగం నాగేశ్వర రావు S/o వేంకటేశ్వర రావు, 48 సం.లు,


3. శ్రీరంగం సుబ్రహ్మణ్యం @ నాని, S/o నాగేశ్వర రావు, 25 సం. లు


4. శ్రీరంగం దుర్గ వెంకటేష్ @ చిన్ని, S/o నాగేశ్వర రావు, 23 సం. లు ఏలూరు నగరంలోని తంగెళ్ళమూడి, MRC కాలనీకి చెందిన పై తెలిపిన ముద్దాయిలు గత 13 సం.లుగా ఆ ప్రాంతంలో అనధికారికాంగా చిట్టెలు వ్యాపారం ( ఒక్కొక్క చిట్టికి 2 లక్షలు, 1 లక్ష, 50 వేలు చొప్పున ) నిర్వహిస్తూ కొంతకాలం ప్రజలకు బాగానే చిట్టిల డబ్బులు చెల్లించి, తరువాత చిట్టీల వ్యాపారంతో డబ్బులు ఎక్కువ సంపాదించాలనే చెడు ఆలోచనతో ప్రజల వద్ద చిట్టీల డబ్బులు కట్టించుకొని గడువు ముగిసినప్పటికీ వారికి చిట్టీల డబ్బులు ఇవ్వకుండా వాయిదాలు వేస్తూవున్నారు. ఇలా చిట్స్ వేసి ఎవరి డబ్బులు వాళ్ళకు ఇచ్చేస్తే ముద్దాయులకు ఎక్కువడబ్బులు మిగలడం లేదు ఎలాగైనా మాయమాటలు చెప్పి చిట్స్ సభ్యులు కు డబ్బులు ఎగ్జిటాలని ఉద్దేశం తో ముధాయిలు అనుకొని, వారు దురుదేశ్యం తో ఎవరైనా చిట్స్ పాడుకున్నా వారి యొక్క చిట్స్ కాలపరిమితి అయిపోయినను వారి చిట్స్ డబ్బులు వారికి ఇవ్వకుండా మీ డబ్బులు ఎక్కడికి పోవు వారి దగ్గర డిపాజిట్ గా వుంటే ఎక్కువ వడ్డీ ఇస్తాము. అని భాదితులను ముద్దాయిలు నమ్మించేవారు. అలా కాకుండా ఎవరైనా గట్టిగా ఒత్తిడి చేస్తే ఏదో కొద్దిగా ఇచ్చి వాళ్ళకు సర్ది చెప్పేవారు. అలా సుమారు 80 లక్షల పైచిలుకు డబ్బులు చిట్స్ సభ్యులు కు మరియు డిపాజిట్ వేసిన వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ముద్దాయిలు నలుగురు కలిసి 56 మందిని మోసం చేసి సుమారు Rs. 80 లక్షలు డబ్బులను ఇవ్వకుండా కొంతకాలం క్రితం కుటుంబంతో సహ ఇల్లు విడిచి పారిపోయినట్లు ఫిర్యాదు రాగా ఏలూరు 2 టౌన్ PS కేసు నమోదు చేసి, సదరు కేసు దర్యాప్తులో భాగంగా ఈ రోజు ముద్దాయిలను అరెస్టు చేసినారు... వారి నేర ఒప్పుకోలు వాగ్మూలం ప్రకారం వారి వద్ద నుండి నేరానికి సంభందించిన ఈ క్రింది వాటిని సీజ్ చేసినాము. మరియు ముద్దయులు చిట్టెల పేరుతో, డిపాజిట్లు పేరుతో భాదితులను మోసగించిన డబ్బులను పెట్టి 1975 గజాల ఇంటి స్థలం లో మూడు అంరాస్తుల డాబా ఇల్లు 2) 75 గజాల ఖాళీ ఇంటి స్థలం, 2) 75 గజాల ఇంటి స్థలం లో రెండస్తుల డాబా ఇల్లు, 4) ముద్దయులుకు కల సొంత భూమి 75 సెంట్లు వంటి ఆస్తులును కొన్నట్లుగా, డవలప్మెంట్ చేసినట్లుగా దర్యాప్తులో తెలిసింది. వాటికు సంభాదించి కోర్టు కు తగు ఆధారాలతో అటాచ్మెంట్ కొరకు పిటిషన్ దాఖలు


చేస్తాము.


1. ఇంటి పత్రాలు ( సుమారు 50 లక్షలు)


2. చిట్స్ తాలూకా బుక్స్ మరియు, బ్యాంక్ అకౌంట్ బుక్స్, ATM కార్డ్స్, పాన్ కార్డ్స్, LIC బాండ్స్ 3. బంగారపు ఉంగరాలు – 2 నగదు - 30,000/- సెల్ ఫోన్స్ - 5


4. మోటార్ సైకిల్స్ – 2


దర్యాప్తు అనంతరం ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం Hon'ble lind AJFCM కోర్ట్, ఏలూరు

హాజరుపరచుటకు గాను పంపబోవుచున్నాము.



Comments