కృష్ణా జిల్లాలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ప్రారంభం


అమరావతి (ప్రజా అమరావతి);


*కృష్ణా జిల్లాలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ప్రారంభం*
*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, లబ్ధిదారులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధక శాఖ మంత్రి*


పాల సేకరణలో, డైయిరీ పరిశ్రమలో మన ప్రభుత్వం రాకముందు మనం చివరి స్ధానంలో ఉన్నాం కానీ ఇప్పుడు వృద్ది రేటు చూస్తే (కేంద్రం ప్రకటించిన వృద్ది రేట్‌)2019 లో పాల ఉత్పత్తిలో 1.4 శాతం ఉంటే ఈ రోజు సీఎంగారి పట్టుదల, ముందుచూపు, దార్శనికత కారణంగా 2021 కి గాను 11.7 శాతంకు చేరుకున్నాం. మాంసంకు సంబంధించి వృద్దిరేట్‌ 2019లో 6.7 శాతం ఉంటే ఇప్పుడు 10.3 శాతంకు చేరుకున్నాం. జగనన్న పాలవెల్లువ గొప్ప విజయవంతమైన కార్యక్రమంగా మేము, పాడి రైతులంతా భావిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఏదైతే ఏపీ అమూల్‌ ప్రాజెక్ట్‌లో ప్రభుత్వం రైతులకు ఇస్తున్న రెమ్యూనరేషన్‌ ఇతర డైయిరీలకంటే చాలా మెరుగ్గా ఉందని సగర్వంగా చెప్పగలము. ఇదే కాకుండా ప్రైవేట్‌ డెయిరీలు కూడా మనం ఇస్తున్న రెమ్యూనరేషన్‌ చూసి రైతులకు అధిక పాలరేట్లు ఇస్తున్న సందర్భం చూస్తున్నాం. ఈ కార్యక్రమం మహిళా సాధికారతను, వారి విషయంలో మరింత అభివృద్దిని సాధించి విజయవంతమైందని చెప్పగలుగుతున్నాం, ధ్యాంక్యూ.


*విజయరాణి, లబ్ధిదారు, బోరవంచ గ్రామం*


సీఎంగారు మా గ్రామంలో జగనన్న పాలవెల్లువ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం సంతోషకరం. మా గ్రామంలో ఆర్‌బీకే ద్వారా మాకు ఈ విషయం తెలసింది. నాకు రెండు పాడిగేదెలు ఉన్నాయి, నేను పదేళ్ళుగా పాడి మీదే జీవనం సాగిస్తున్నాను. నేను ప్రేవేట్‌ డెయిరీలో పాలు పోస్తే లీటర్‌కు రూ. 40 చొప్పున ఇచ్చేవారు, ఎస్‌ఎన్‌ఎఫ్‌ అనేది తెలిసేది కాదు, కానీ ఈ కేంద్రంలో పాలు పోస్తే ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతం, వెన్న శాతం తెలుస్తున్నాయి. నేను ఇప్పుడు అదనంగా ఆదాయం పొందుతున్నాను. నాకు బిల్లు రూపంలో, మెసేజ్‌ రూపంలో ఏ రోజుకు ఆ రోజు వస్తుంది. మా గేదెలకు కూడా అమూల్‌ వారి దాణాని, మేతను ఇస్తున్నారు. వారు ఇచ్చే లోన్‌ తీసుకుని అదనంగా గేదెలు కొనుక్కుని అదనంగా ఆదాయం పొందుతాం. నాలాంటి మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరం. నేను వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నాను. చాలా సంతోషంగా ఉంది, ధ్యాంక్యూ సార్‌.


*మార్తమ్మ, లబ్ధిదారు, రాఘవపురం, రెడ్డిగూడెం మండలం*


జగనన్నా నేను, నా భర్త గేదెలు మేపుకుని కష్టపడి బతికేవాళ్ళం. ప్రేవేట్‌ కేంద్రాలలో పాలు పోస్తే లీటర్‌కు రూ. 30, 35 వచ్చాయి, ఆ డబ్బు దాణాకు సరిపోయేది కాదు. ఇప్పుడు ఈ కేంద్రంలో పాలు పోస్తే లీటర్‌కు రూ. 74 వచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ డబ్బు నా కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది. పాడి పెంచుకోవడానికి లోన్‌ తీసుకున్నాను, దాణా కూడా తీసుకున్నాను. నాకు అమ్మ ఒడి కూడా అందింది. పిల్లలను ఎలా చదివించాలా అనుకునే టైంలో మీరు చదివిస్తున్నారు. మా అత్తగారికి ఫించన్‌ కూడా వస్తుంది. మాలాంటి పేదలకు ఈ పథకం చాలా ఉపయోగకరం. మా పిల్లలు కూడా జగన్‌ మామయ్య ఉండగా నీకు ఎందుకు దిగులు అంటారు, మీరు ఎప్పటికీ సీఎంగా ఉండాలి అన్నా


*వీరమ్మ, లబ్ధిదారు, పోలవరం, చాట్రాయి మండలం*


అన్నా నాకు నాలుగు గేదెలున్నాయి. వేరే కేంద్రంలో పాలు పోస్తే తక్కువ ఇస్తున్నారు. ఇంత తక్కువతో ఎలా బతకాలా అనుకున్నాం, మేం గేదెలు అమ్మేసుకుందాం అనుకునే సమయంలో వలంటీర్‌ వచ్చి ఈ పథకం గురించి చెప్పాడు. ఇప్పుడు ఈ కేంద్రంలో పాలు పోస్తే లీటర్‌కు అదనంగా రూ. 30 వస్తున్నాయి. నాకు ఇక్కడ పాలు పోయడం వల్ల బాగా మిగులుతుంది, నాకు అన్ని పథకాలు అందుతున్నాయి. నాలాగా మిగిలిన వారు కూడా ఇప్పుడు ఈ కేంద్రంలో పాలు పోయాలనుకుంటున్నారు. అంతేకాక ఇప్పుడు ఏ ఆఫీస్‌కు వెళ్ళినా మా మహిళలకు మంచి గౌరవమిస్తున్నారు. మీరు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను, ధన్యవాదాలు


*లక్ష్మీతిరుపతమ్మ, లబ్ధిదారు, వట్టిగుడిపాడు, ఆగిరిపల్లి మండలం*


జగనన్నా మాకు మూడు గేదెలున్నాయి, ఇప్పుడు వెన్న శాతం, ఎస్‌ఎన్‌ఎఫ్‌ శాతం బాగా వస్తుంది, మంచి ధర కూడా వస్తుంది. మేం గత 15 ఏళ్ళుగా పాడి మీదే జీవిస్తున్నాం, వేరే డెయిరీకి పాలు పోసినప్పుడు ఇంత ధర రాలేదు. మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు, వారికి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ కూడా వస్తుంది. మా మహిళల కోసం మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. దాణా, పశుగ్రాసంకు లోన్‌ కూడా వచ్చింది, అన్నా మీకు ముందస్తుగా నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు.