తాడేపల్లిగూడెం (ప్రజా అమరావతి);
పిఎంపి వైద్య సేవలు అందించే వ్యక్తులు సహాయ, సేవా దృక్పథంతో ఉండాలని
మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పేర్కొన్నారు.
సోమవారం తాడేపల్లిగూడెంలో ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 59వ ఆవిర్భావ దినోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు గారు తో కలిసి ముఖ్య అతిధి గా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితుల్లో కొందరు పిఎంపి ప్రాక్టీసు చేసే వారు సేవా గుణంతో వైద్య సేవలు అందించడం స్ఫూర్తి కల్పించిందని అన్నారు. సమాజంలో తక్షణమే వైద్య సేవలు అందించేందుకు ఎప్పుడు ముందుకు వొచ్చే పిఎంపి ల సేవలను ప్రజలు ఎప్పుడూ గుర్తింపు పొందుతారని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి ని సన్మానించారు.
addComments
Post a Comment