వైసీపీపై రోజురోజుకూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

 *-ప్రత్యేకహోదాపై రాజీనామాలకు సిద్ధం..మీరు సిద్ధమా.?*

*-జగన్ ది అవకాశవాద రాజకీయం*

*ఈ ప్రభుత్వం ఉన్నన్నినాళ్లూ రాష్ట్రంలో విధ్వంసమే*

*-ఇది పేదల రక్తాన్ని తాగే ప్రభుత్వం*

*వైసీపీపై రోజురోజుకూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత*

*టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*

గుంటూరు (ప్రజా అమరావతి) : వైసీపీ ప్రభుత్వం రోజురోజుకూ రాష్ట్రాన్ని అన్ని విధాలా విధ్వంసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు నేడు చేసే పనులకు పొంతన లేదు. ఇదంతా జగన్ రెడ్డి అవకాశవాద రాజకీయం. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, అధికారం వస్తే చాలన్నది తప్ప, అన్నీ అసత్యాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితికి వచ్చారు. వైసీపీ మోసాన్ని రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకోవాలి. పరిపాలనా అనుభవం లేకపోవడంతో నేడు రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోంది. అధికారమే ధ్యేయంగా పనిచేసి రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టుపట్టించారో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రత్యేక హోదాపై విభజనకు ముందు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని అందరం పోరాడాం. లోక్ సభలో బిల్లు పాస్ అయిన తర్వాత రాజ్యసభకు వెళ్లినప్పుడు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు గట్టిగా పారాడితే అప్పటి ప్రధాని ఇప్పటికిప్పుడు బిల్లు పెట్టలేంగానీ, హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. 25 మందికి 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తానని 01.05.20218న అన్నారు. ప్రత్యేకహోదా ఏపీకి సంజీవని, హోదా వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఒంగోలు లాంటి టౌన్ కూడా హైదరాబాద్ లాగా అవుతుందని జగన్ చెప్పారు. ఇప్పుడు మాత్రం బీజేపీకి మెజారిటీ వచ్చిందంటున్నారు. మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా బీజేపీకి మెజారిటీ ఉన్నా మా కేంద్రమంత్రులతో రాజీనామా చేయించి హోదా కోసం పోరాడాం. మీరెందుకు పోరాడరు.? 30.11.2021న ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం అని పార్లమెంట్ లో మంత్రి చెప్పారు. మీరేం చేస్తున్నారు..ఎక్కడున్నారు.? ఎందుకు హోదాపై పోరాడటం లేదో సమాధానం చెప్పండి. ఇది మీ మోసం, దగా కాదా.? ప్రత్యేకహోదా సాధిస్తామని ప్రజలకు, యువతకు భరోసా ఇచ్చి సాధించలేకపోతే రాజీనామా చేస్తామని, మమ్మల్ని కూడా చేయమని చెప్పారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ఎంపీలతో రాజీనామా చేయించండి, మా ఎంపీలను కూడా రాజీనామా చేయించి పోరాడదాం ఈ సవాల్ కు వైసీపీ సిద్ధమా.? మాయ మాటలు, మభ్యపెట్టే మాటలు, సన్నాయి నొక్కులతో పక్కదారి పట్టించే రాజకీయాలు చేయొద్దు. మేము నిలదీస్తే కేసులు పెట్టి పక్కదారి పట్టించేలా చేస్తున్నారు. మీ డైవర్షన్ రాజకీయాలు పనిచేయవు. రోజురోజుకూ వైసీపీపై ప్రజల్లో తిరుగుబాటు పెరుగుతోంది. రైల్వేజోన్ పై విశాఖ రైల్వే జోన్ పై ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కేంద్రం కూడా రైల్వే జోన్ పెడతామని ఎన్నికల ముందు చెప్పింది. దేశంలో 17 రైల్వే జోన్ లు ఉన్నాయి, విశాఖ పరిశీలనలో లేదని ఇప్పుడు చెప్తున్నారు. కనీసం ఈ వైసీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. రాష్ట్ర హక్కులు కాపాడటంలో పూర్తిగా విఫలం అయ్యారు. విభజన సమయంలో ప్రత్యేకంగా ఏపీకి కొన్ని హక్కులు పెట్టి, అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి జరగాలంటే రాష్ట్రానికి కొన్ని హామీలివ్వాలని చెప్పాం. హైదరాబాద్ అభివృద్ధి చెందిన నగరం తెలంగాణకు వెళ్లింది కాబట్టి ప్రత్యేకంగా కేంద్రం చట్టంలో పెట్టింది. విశాఖపట్నం మీద ప్రేమ చూపించి రాజధాని తెస్తామని చెప్తున్నారు. విశాఖకు వచ్చే రైల్వే జోన్ పోయింది. రైల్వే జోన్ వల్ల వస్తాయన్న ఉద్యోగాలు ఎటు పోయాయో సమాధానం చెప్పలేని ముఖ్యమంత్రి ఏ విధంగా హామీలు నెరవేస్తారు.? రైల్వే జోన్ తెస్తామని మాయమాటలు చెప్పి మోసం చేశారు. విశాఖ వాసులు ఈ మోసాన్ని అర్థం చేసుకోవాలి. 

*విశాఖ ఉక్కుపై*  విశాఖ ఉక్కు ఎన్నికల ముందు ఏం చెప్పారు..ఇప్పుడు ఏం చేస్తున్నారు.? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. దీని కోసం అన్ని ప్రాంతాల ప్రజలు పోరాడి సాధించుకున్నారు. ఇది పరిశ్రమ కాదు.. ఇదొక సెంటిమెంట్. రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. త్యాగాలు చేసి సాధించిన ప్రాజెక్టు ఇది. ప్రైవేటీకరణ చేయాలని ఎప్పటి నుంచో ఆలోచనలు ఉన్నాయి. 16 మార్చి 2000 ఏడాదిలో ప్రైవేటీకరణ చేస్తుంటే ఎర్రన్నాయుడు పార్లమెంట్ లో లేవనెత్తారు.  రూ.3 వేల కోట్లు కావాలి, 16 వందల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, రైతులు భూములు ఇచ్చారు న్యాయం చేయాలని పోరాడారు. దీన్ని ప్రాజెక్టు కింద చూడకుండా, సెంట్ మెంట్ గా చూడాలని వాజ్ పేయ్ తో చెప్పాం. రూ.13 వందల కోట్ల గ్రాంట్ ఇచ్చారు. 1998 మే 3న అప్పటి సీఎం నవీన్ పట్నాయక్ ను కలిశాం. 1998 ఆగస్టు 11న రూ.1330 కోట్లు ఈక్విటీ ఇచ్చారు. ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టును రక్షించాం. ఈ ప్రాజెక్టు వల్ల దేశాభివృద్ధి జరుగుతోంది. విశాఖ, గాజువాక కూడా ఈ ప్రాజెక్టు వల్ల అభివృద్ధి చెందాయి కాబట్టే దీన్ని ప్రైవేటీకరణ కాకుండా చేయాలని పోరాడి కాపాడాం. కానీ ఈ సీఎం మాత్రం రాజకీయాలు చేసి దొంగతనంగా పోస్కో వాళ్లతో మాట్లాడారు. మీకు సెంట్ మెంట్, రాష్ట్రమంటే అభిమానం లేదు. డబ్బు లూఠీ చేయడం తప్ప ఏమీ లేదు. పోలవరంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసి పోలవరాన్ని నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నించారు. ఈ ప్రాజెక్టు విషయంలో రాజశేఖర్ రెడ్డి తప్పుటడుగులు వేసి టెండర్లు రద్దు చేసి ఇష్టానుసారంగా చేశారు. తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ టెండర్లు పిలిస్తే రేట్లు తక్కువగా ఉన్నాయని కాంట్రాక్టర్ల ముందుకు రాలేదు. భూసేకరణ చేసి పరిహారం కూడా సరిగా ఇవ్వలేకపోతే ప్రాజెక్టు పూర్తిగా పక్కనపడింది. దీంతో మేం ప్రత్యేక దృష్టి పెట్టి భూసేకరణ చేసి పరిహారం ఇచ్చాం. అప్పటి నుండి ఈ ప్రాజెక్టు వేగం పెంచాం. ఐదేళ్లలో రూ.11,537 కోట్లు ఖర్చు చేసి 70 శాతం పూర్తి చేశాం. తెలంగాణలోని 7 మండలాలను నేను సీఎం కాకముందు ఢిల్లీ వెళ్లి మోడీ, రాజనాథ్ సింగ్ ను మండలాలు ఇవ్వకపోతే ప్రాజెక్టు పూర్తి కాదని చెప్పాం. ఎట్టి పరిస్థితుల్లో  మండలలాను ఆంధ్రప్రదేశ్ విలీనం చేయకపోతే ముఖ్యమంత్రిగా కూడ ప్రమణం స్వీకారం చేయనని చెప్పాను. చరిత్రలో ఎప్పుడు జరగనది మెదటి క్యాబినేట్ లో నిర్ణయం తీసుకోని రాష్ట్ర్తపతికి పంపడం జరిగింది. మండలాలు ఏపీకి ఇచ్చిన తర్వాతే ఆర్డినెన్స్ ఇచ్చి సంతకం చేశాక పార్లమెంట్ సమావేశాలు జరిపారు. బాధితులకు రూ.19 లక్షల పరిహారం ఇస్తామని రెచ్చగొట్టారు. సక్రమంగా చేస్తే 2020కి ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది. ఈ పాటికి నదుల అనుసందానం జరిగేది. రూ.67 వేల కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు చేశాం. ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలన్నదే టీడీపీ ఆలోచన. పోలవరాన్ని 2020 పూర్తి చేస్తామన్నారు.. తర్వాత 2021 లో పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు 2022లో పూర్తవుతుందని చెప్పారు. 2022లో కూడా పూర్తి చేయడం అనుమానమేనని కేంద్ర మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థతి ఎందుకు వచ్చింది.? రాష్ట్రానికి అమరావతి, పోలవరం రెండు కళ్లు లాంటివి. విభజన తర్వాత ఇబ్బంది పడకూడదని పోలవరంతో నీటి ఎద్దడి తగ్గిపోవాలని ప్రయత్నించాం. అమరావతితో పిల్లలకు ఉద్యోగాలు వచ్చి, సంపద సృష్టించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తే పోలవరం అమరావతిని నిర్వీర్యం చేశారు. పోలవరంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదనికేంద్రం తెలిపింది. రివర్స్ టెండ రింగ్ తో పోలవరాన్ని నాశనం చేశారు. రివర్స్ టెండరింగ్ వల్ల ఖర్చు పెరిగింది, కాలయాపన చేశారు. కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును పూర్తి చేయలేని పరిస్థితికి వచ్చింది. రూ.55 వేలకోట్లకు డీపీఆర్ సిద్ధం చేసి మంజూరు చేయిస్తే రేట్లు పెంచారని పిటిషన్లు పెట్టించారు. ఇవాళ వీళ్లు వెళ్లి అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు, మీరే చెప్పారు రూ.20 వేల కోట్లే ఇస్తామని అంటున్నారు. మొత్తం ప్రాజెక్టును రూ.47,700 కోట్లకు తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఎవరి వల్ల వచ్చిందో సమాధానం చెప్పండి.? అవగాహన రాహిత్యం వల్ల ఇరిగేషన్ ను భ్రష్టు పట్టించారు. కేంద్రం అనుమతి ఇస్తే ప్రాజెక్టును చేపట్టే పరిస్థితి ఏర్పడిందంటే పనికి మాలిన ప్రభుత్వం వల్లే ఏర్పడింది. చిన్న కాలువ తవ్వకోవాలన్నా కేంద్రం అనుమతి తీసుకునే పరిస్థితి వచ్చిందంటే జగన్ రెడ్డి చేతకాని తనం వల్లే. అమరావతిపై ఈ ముఖ్యమంత్రి మడమ తిప్పనని చెప్పి ప్రతి అంశంలోనూ యూటర్న్ తీసుకుంటున్నారు. 13 జిల్లాల చిన్నరాష్ట్రం, చిచ్చు పెట్టడం ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఇదేనా మీ రాజకీయం.? ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వైసీపీ వాళ్లు మాట్లాడేదానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కులాలు, ప్రాంతాల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తూ ఉద్ధిరిస్తున్నట్లు ప్రజలను మోసం చేస్తున్నారు.  వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ కడుతున్నారని చెప్పారు. ప్యాలెస్ కట్టి ఏం ఉద్దరించారు.? ప్రజావేదికతో విధ్వంసం సృష్టించి, అమరావతిని నాశనం చేశారు. రూ.2 లక్షలకోట్ల సంపద, యువతకు ఉద్యోగాలు కల్పించి, రాష్ట్రానికి ఆదాయం పెంచే నగరం అమరావతి. తెలంగాణకు హైదరాబాద్ ఉంది, తమిళనాడుకు చెన్నై ఉంది, కర్నాటకు బెంగళూరు ఉంది. కేంద్రం కూడా దాదాపు రూ.2,500 కోట్లు అందించింది. రాజధాని గెయిన్స్ కూడా రాయితీలు ఇచ్చారు. కేంద్రంలో పెట్టిన చట్టం ప్రకారం అమరావతి వచ్చింది. రైతులకు ఇచ్చిన అగ్రిమెంట్లు ఇష్టానుసారంగా మార్చడానికి వీళ్లేదు. రైతులున్ని విపరీతంగా ఇబ్బందిపెడుతున్నారు. భోజనం చేయడానికి స్థలాలు కూడా ఇవ్వకుండా చేయనీకుండా చేశారంటే మనుషులేనా మీరు.? అన్యాయం జరిగితే రక్షించే హక్కులేదా.? న్యాయస్థానం నుండి దేవస్థానం వెళ్లే హక్కు రైతులకు లేదా.? తప్పుడు పనులన్న చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. చెత్త మీద పన్ను వేసిన తుగ్లక్ ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్, గ్యాస్, పన్నులు, నిత్యావసర ధరలు, ఎన్టీఆర్ హాయంలో ఇచ్చిన ఇళ్లకు నీకు పదివేల ఇవ్వాలా.? మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20 వేలు ఇవ్వాలి.  మీరేమైనా స్థలం ఇచ్చి ఇళ్లు కట్టారా.? పట్టా ఇస్తామని చెప్తున్నారు..కాదు పేదల మెడకు ఉరితాళ్లు వేస్తున్నారు. ఆ ఉరితాళ్లే మీకు శాపంగా మారబోతున్నాయి. 40 లక్షల మంది పేదలు రోడ్డున పడ్డారు. కోవిడ్ వల్ల డబ్బులు లేక బాధపడుతుంటే వారందరి నుండి బలవంతంగా ఓటీఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారు. బెదిరించి డబ్బులు కట్టించుకుంటూ స్వతహాగా ఇస్తున్నారని చెప్తున్నారు. ఎన్ని రోజుల నుండి జరుగుతోంది ఈ రౌడీయిజం.? ప్రభుత్వాలు శాశ్వతం కాదు గుర్తుంచుకోండి. ప్రజలు తిరుగుబాటు చేస్తే మీరు నిలబడే పరిస్థితి ఉండదు. టీడీపీ అధికారంలో ఉన్న చివరి నాటికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఉన్న అప్పులు 3.14 లక్షల కోట్ల అప్పు ఉంది.  దాన్ని ఏడు లక్షల కోట్లకు రెండున్నరేళ్లలో తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి, కలెక్టరేట్లు తాకట్టు పెడుతున్నారు. ఉచితంగా ఆరోగ్యం అందిస్తామని చెప్పి, కనీసం ఉచితంగా భోజనం పెట్టే పరిస్థితి కూడా లేదు. చిన్న పిల్లల ఆహారానికి కూడా నిధులు ఇవ్వడం లేదు. మధ్యాహ్న భోజనం పెట్టలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఎక్కడ చూసినా అప్పలు పెట్టారు. జాబ్ లెస్ క్యాలెండర్ అని, రీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వరి ధాన్యాన్ని కొనే నాథుడు లేడు. రైతులంతా పంటవేయడం మానేశారు. వరి వేసిన ప్రతి రైతూ నష్టపోతున్నారు. అంగన్వాడీల్లో బిల్లులు చెల్లించడం లేదు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. 16 వేల కోట్లు లోటు ఉన్నా 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాం. ఉద్యోగులను ఆదుకోవాలని వెంటనే వారి హక్కులను కాపాడాం. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వాళ్లను రెగ్యులర్ చేస్తామన్నారు. అమరావతి, పోలవరం రైతులు రోడ్డు మీదకు వచ్చారు. విశాఖ ఉక్కు కార్మికులు రోడ్డు మీదకు వచ్చారు. కట్టిన టిడ్కో ఇళ్లను రెండున్నరేళ్లుగా ఇవ్వకుండా రోడ్డు మీద నెట్టేస్తున్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆశా వర్కర్లు పోరాడుతున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను  కావాలని నిర్వీర్యం చేయడంతో విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చారు. 77 జీవోపై విద్యార్థులు పోరాడుతున్నారు. 217 జీవో రద్దు చేయాలని మత్య్సకారులు పోరాటానికి వచ్చారు. ఇసుక కోసం భవన నిర్మాణ కార్మికులు పోరాడే స్థితికి వచ్చారు. చేసిన అప్పులన్నీ ఏం చేశారు.? రాష్ట్ర హక్కులను పోగొట్టారు. అంశాలు పక్కదారి పట్టించేందకు టీడీపీపై కేసుల పెడుతున్నారు. వైసీపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఈ ప్రభుత్వం ఉన్నన్నినాళ్లూ విధ్వంసమే.  టీడీపీ ఒక్కటే పోటారంచేయడం కాదు ప్రజలు చైతన్యం కావాలి. టీడీపీ అన్ని రకాలుగా సహకరిస్తుంది. అన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నింటికీ వైసీపీనే కారణం. రౌడీయిజం చేసి రాజకీయం చేయాలనుకుంటున్నారు. దమ్ముంటే చర్చకు రండి ఎవరేంటే నిరూపించుకుందా.? అమరావతి, పోలవరం, రైల్వేజోన్ ను నిర్వీర్యం చేశారు. ఏ ఒక్క హామీనైనా సాధించారా.? ఇలాంటి మీకు రాష్ట్రాన్ని పాలించే హక్కుఉందా.? కొంత మంది పోలీసులు ఇష్టమొచ్చినట్లు చేస్తే రాజకీయం అవుతుందనుకుంటున్నారు..అది మీ వల్ల కాదు. ఇంటి పట్టాలకు కూడా వైసీప రంగులతో, జగన్ బొమ్మ వేస్తున్నారు. ఇది పార్టీ పట్టానా.? తాకట్టు పెట్టుకుని, అమ్ముకోండని చెప్తున్నారా? పేదలకు అండగా ఉంటాం..మీరు పోరాడండి. ఇది పేదల రక్తాన్ని తాగే ప్రభుత్వం. ఎక్కడి నుండి తెచ్చి 10 వేలు కట్టాలని గుండెలు బాదుకుంటున్నారు. బ్రిటిషువాళ్లు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించలేదు.