సీడీఎస్ జనరల్ రావత్ మృతి దేశానికీ తీరని లోటు.. శ్రీరంగనాధ్ రాజు.




తాడేపల్లిగూడెం (ప్రజా అమరావతి);



సీడీఎస్ జనరల్ రావత్ మృతి దేశానికీ తీరని లోటు.. శ్రీరంగనాధ్ రాజు. 


దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరో 12 మంది హెలికాప్టర్ ఘటనలో ఆ


యన భార్య మధులిఖ లతో పాటు మరో 11 మంది సాయుధ బలగాలు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రమాదవశాత్తు  మరణించడం  దేశానికి అతిపెద్ద లోటని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు  పేర్కొన్నారు.


 సీడీఎస్ జనరల్ రావత్ మృతి కి మంత్రి శ్రీరంగనాధ్ రాజు గురువారం ఒక ప్రకటన లో సంతాపం వ్యక్తం చేశారు.  ఆయన అకాల మరణం మన సైనిక బలగాలకు, దేశానికి తీరని లోటు ఆయన తో పాటు ఆయన భార్య మధులిఖ రావత్ మృతి కి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ని వ్యక్తం చేశారు. .. ఈ ఘటన లో మృతి చెందిన సైనికుల కుటుంబాలకు తనప్రగఢ సానుభూతిని తెలిపారు. వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు మనోధైర్యం తో ఉండాలని తెలిపారు..


జనరల్ బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ వ్యవహరిస్తున్న చిత్తూరు జిల్లా కురబల కోట మండలం రేగడ గ్రామానికి చెందిన సాయితేజ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, వారి  కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ని మంత్రి వ్యక్తం చేశారు.



Comments