తణుకు (పైడిపర్రు) (ప్రజా అమరావతి)!
రాష్ట్రంలో ప్రజలు సుఖ:సంతోషాలతో ఉండాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కోరుకున్నారు.
శనివారం క్రిస్టమస్ సందర్భంగా తణుకు పైడిపర్రు లోని స్థానిక బెతేల్ రిఫార్మ్డ్ చర్చిలో బ్రదర్ పాస్టర్ జాషువా జుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రార్ధన లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. మీరందరూ అందరి ఆశీర్వదించారూ కాబట్టే జగనన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం తపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, రాబోయే కాలంలో కూడా మనకు జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని పిలుపునిచ్చారు
addComments
Post a Comment